
Celebrities New Year Wishes Posts In Social Media: 2021 సంవత్సరం వెళ్లిపోయింది. సంతోషంగా, బాధగా, కష్టంగా గడిచిన ఈ సంవత్సరం అనుభవాలు, అనుభూతులను పంచుకున్నారు సెలబ్రిటీలు. ఈ ఏడాది కూడా సంతోషంగా, అనుకున్నవి అనుకున్నట్లు జరగాలనే ఆశతో న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెబుతున్నారు. కొత్త ఆశలతో కొత్త సంవత్సరం వచ్చింది. ప్రతి ఒక్కరూ న్యూ ఇయర్‌ను సంతోషంగా ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు శుభాకాంక్షలు తెలియజేయండని తారలు అభిమానులకు చెబుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీల శుభాకాంక్షల పోస్టులతో సోషల్ మీడియా వెల్లివిరిస్తోంది.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ శనివారం (జనవరి 1) ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుమలను దర్శించుకుంది. ఆమె స్నేహితుడితో కలిసి అజయ్ ధర్మతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా స్వామి వారిని దర్శించుకుంది. తిరుపతి బాలాజీ ఆశీస్సులతో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది చిరస్మరణీయంగా ఉండాలని కోరుకుంటున్నాను. అని తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ షేర్ చేసింది కంగనా. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఒక వీడియో షేర్ చేస్తూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు. ఈ క్లిప్‌లో దీపిక పదుకొణె ఆహారం తింటూ 83 మూవీలోని ఒక డైలాగ్‌ను స్ఫూఫ్ చేసి చెప్పడం బాగుంది.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 'నా ప్రియమైన వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు' అని పోస్ట్ చేశారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబం న్యూ ఇయర్‌ను దుబాయ్‌లో సెలబ్రేట్ చేసుకుంటుంది. 'కొత్త ప్రారంభం మ్యాజిక్‌పై విశ్వాసం ఉంచండి. హ్యాపీగా, దయతో, కృతజ్ఞతను కలిగి ఉండండి. హ్యాపీ న్యూయర్ 2022. సురక్షితంగా ఉండండి. లవ్ యూ ఆల్' అని తన కుటుంబతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ విష్ చేశారు మహేశ్ బాబు. నెషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా న్యూ ఇయర్ విషెస్ తెలిపింది. 'హ్యాపీ 2022 మై లవ్స్' అని ఒక అందమైన ఫొటోను షేర్ చేసింది రష‍్మిక. చందమామ కాజల్ తన భర్త ఫొటోను పంచుకుంటూ అభిమానులకు శుభాకాంక్షలు చెప్పింది. గతేడాది జ్ఞాపకాలు, ఆనందాలను ప్రస్తావిస్తూ పోస్ట్ చేసింది. వీరితోపాటు అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ, అర్జున్ కపూర్, హృతిక్ రోషన్, సమంత, నయన తార-విఘ్నేశ్ శివన్ తదితర పాపులర్ స్టార్ నూతన సంవత్సర శుభాకాంక్షలను అభిమానులకు తెలియజేశారు.
Trust the magic of new beginnings! Be happy, be kind, be grateful! Happy New Year 2022! Stay safe everyone. Love you all ❤️🤗 pic.twitter.com/imt6vXH0yW
— Mahesh Babu (@urstrulyMahesh) December 31, 2021