![Chiranjeevi makes fish fry for mother Anjana Devi - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/11/chir.jpg.webp?itok=qI1haus0)
తల్లితో చిరంజీవి; వంట చేస్తూ...
ఆ మధ్య తన తల్లి అంజనాదేవి కోసం చిరంజీవి దోసె వేశారు. దోసెను స్టయిల్‌గా పెనం మీద నుంచి పైకి ఎగరేస్తూ, వీడియోను షేర్ చేశారు. తాజాగా అమ్మ కోసం చిరంజీవి చేపల వేపుడు చేశారు. ఆ వీడియోను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ– ‘‘ఆదివారం ఖాళీగా ఉన్నాను. ఏమీ తోచకపోవడంతో ఏదో ఒకటి చేయాలనిపించింది. ఏం చేద్దామా? అని అనుకుంటుండగా.. వంట ఎందుకు చేయకూడదనిపించింది. వంట అనేసరికి నాకు ఒక్కసారి చిన్నప్పటి రుచులు గుర్తొచ్చాయి.
చిన్న చిన్న చేపలను.. చింతకాయ తొక్కుతో కలిపి వేపుడు చేసి పెట్టేది మా అమ్మ. చాలా రుచిగా ఉండేది. మాకు ఇంత చేసి పెట్టిన అమ్మకి సరదాగా ఈ కూర నేను చేసి పెడితే ఎలా ఉంటుందనిపించింది. మరి తిడుతుందో.. బ్రహ్మాండంగా ఉంది అంటుందో చూద్దాం’’ అంటూ చేపల వేపుడును తల్లికి వడ్డించారు చిరు. ‘చాలా బాగుంది నాన్నా’ అని అమ్మ అనడంతో చిన్నపిల్లాడిలా సంబరపడిపోయారాయన. ఈ వీడియో బాగా వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment