ఉగాది పురస్కరించుకొని తన ఫ్యాన్స్‌కు తీపి కబురు అందించారు మెగాస్టార్ చిరంజీవి. తన అభిప్రాయాలను మరింత బలంగా వినిపించడం కోసం ఉగాది నుంచి సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుతున్నానని ప్రకటించారు. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న చీరంజీకి ఇప్పటి వరకు సోషల్ మీడియా అకౌంట్లు లేవు. ఎప్పుడైనా సందేశం ఇవ్వాలంటే వీడియో రూపంలోనో, ప్రకటన రూపంలోనో వెలువరించేవారు. ఇకపై సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటానని చిరంజీవి అన్నారు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు.
‘ఇక నేను కూడా సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుదామనుకుంటున్నాను. దానికి కారణం ఎప్పటికప్పుడు నా భావాలను నా అభిమానులతో షేర్ చేసుకోవడానికి.. అలాగే, నేను ఇవ్వాలనుకునే మెసేజ్‌లు కానీ, చెప్పాలనుకునే విషయాలను కానీ.. ప్రజలతో చెప్పుకోవడానికి వేదికగా భావిస్తూ.. నేను ఇక మీదట సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుతున్నాను. అది ఈ ఉగాది రోజు నుంచే’ అంటూ వీడియోలో ద్వారా చిరంజీవి ఈ విషయాన్ని తెలియజేశారు.
కాగా, చిరంజీవి ప్రస్తుతం ‘ ఆచార్య’ అనే చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. అయితే కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment