Comedian Satya Appears In Ram Charan Private Jet - Sakshi
Sakshi News home page

Ram Charan: దటీజ్‌ రామ్‌చరణ్‌, కమెడియన్‌ను సొంత విమానంలో తీసుకొచ్చి..

Published Thu, Jul 7 2022 5:46 PM | Last Updated on Thu, Jul 7 2022 7:22 PM

Comedian Satya Appears In Ram Charan Private Jet - Sakshi

ఇదే సినిమాలో కమెడియన్‌ సత్య కూడా నటిస్తున్నాడు. అతడు కూడా తిరిగి హైదరాబాద్‌కు రావాల్సి ఉండగా.. ఈ విషయం తెలుసుకున్న రామ్‌చరణ్‌, సత్యను తన సొంత విమానంలో తనతో పాటు హైదరాబాద్‌కు తీసుకు వచ్చారు. 

సినిమాలను రఫ్ఫాడించే రామ్‌చరణ్‌ ఎన్నో మంచి పనులు చేస్తూ రియల్‌ హీరోగానూ పేరు తెచ్చుకున్నాడు. గతంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే, ఆమె డెడ్ బాడీ తీసుకోవడానికిగానూ ఆసుపత్రికి చెల్లించడానికి డబ్బుల్లేకపోతే రామ్‌చరణ్‌ ముందుకొచ్చి సాయం చేశాడు. నటుడు కాదంబరి కిరణ్, దర్శకుడు సుకుమార్ చొరవతో చెర్రీ దగ్గర రెండు లక్షల రూపాయలు తీసుకుని "మనం సైతం" ద్వారా ఆ కార్యక్రమం పూర్తి చేశారు. అవికాక సుకుమార్ తదితరుల వద్ద రూ.1,20,000/- పోగుచేసి చనిపోయినామె పాప పేరున ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. కొన్ని రోజులు తర్వాత నటుడు కాదంబరి కిరణ్.. రామ్ చరణ్‌కు ఎదురుపడితే "ఆ పాప ఎలా ఉంది కాదంబరి గారూ?'' అని ఆమె గురించి ఆరా తీశారు. అదీ రామ్ చరణ్ వ్యక్తిత్వానికి నిదర్శనం. 

తాజాగా చెర్రీ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ అమృత్‌సర్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో చరణ్‌కు సంబంధించిన సన్నివేశాలు పూర్తయ్యి హైదరాబాద్‌కు తిరిగి రావాల్సి ఉంది. ఇదే సినిమాలో కమెడియన్‌ సత్య కూడా నటిస్తున్నాడు. అతడు కూడా తిరిగి హైదరాబాద్‌కు రావాల్సి ఉండగా.. ఈ విషయం తెలుసుకున్న రామ్‌చరణ్‌, సత్యను తన సొంత విమానంలో తనతో పాటు హైదరాబాద్‌కు తీసుకు వచ్చారు. 

కాగా కమెడియన్ సత్య.. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. ఈ విషయం తెలుసుకున్న చరణ్ గతంలోనే రంగస్థలం సినిమాలో సత్యకి ఒక అవకాశం కల్పించాడు. ఇప్పుడు ఏకంగా తనతో ప్రయాణం చేసే అవకాశం కల్పించడాన్ని అభిమానులు ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.

చదవండి: అప్పుడే ఓటీటీకి సమ్మతమే మూవీ, స్ట్రీమింగ్‌ ఎ‍ప్పుడు, ఎక్కడంటే..
ఆ కామెడీ షో నుంచి అందుకే తప్పుకున్నా.. జబర్దస్త్‌ అప్పారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement