Case Filed on Jathi Ratnalu Movie, Kachiguda, Hyderabad - Sakshi
Sakshi News home page

జాతిరత్నాలు సినిమాను నిషేధించాలి: శివసేన 

Published Thu, Mar 25 2021 3:13 PM | Last Updated on Thu, Mar 25 2021 5:29 PM

Complaint File On Jathi Ratnalu Movie In Kachiguda PS - Sakshi

సాక్షి, కాచిగూడ: జాతిరత్నాలు సినిమాలో స్వాతంత్ర సమరయోధులను కించపరిచారని, సినిమా దర్శకుడు, నిర్మాత, నటులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ శివసేన రాష్ట్ర ప్రధానకార్యదర్శి భూమా గంగాధర్‌ ఆధ్వర్యంలోని ప్రతినిధులు కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భూమా గంగాధర్‌ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధులు రాంప్రసాద్‌ బిస్మిల్‌ ఉరికంబం ఎక్కే ముందు పాడిన సర్‌ ఫరోషికీ తమన్నా హబ్‌ హమారే దిల్‌ మీ హై.. కవితను జాతిరత్నాలు సినిమాలో సర్‌ ఫరోషికీ తమన్నా, సమంతా, రష్మిక, తీనోసాథ్‌ హాయ్‌.. అంటూ వెటకారంగా పాడి అవమానించారని తెలిపారు.

నేటి తరానికి తప్పుడు సందేశాన్ని  అందించిన సినీ రచయిత, నిర్మాత, మ్యూజిక్‌ డైరెక్టర్, కవితను ఆలపించి అవమానపరిచిన గాయకులపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివసేన నేతలు కంజర్ల శ్రీధరాచారి, రితేష్, శ్రీనివాసాచారి, సురేష్, వేణు తదితరులు పాల్గొన్నారు.  

చదవండి: 
ఓటీటీలో జాతిరత్నాలు: మీరనుకునే డేట్‌ కాదు!

సీఎం జగన్‌ ప్రకటన.. చిరంజీవి హర్షం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement