
నా శరీరంలో చాలా మార్పులొచ్చాయి. నేను వేసుకున్న మందులు, నాకిచ్చిన స్టెరాయిడ్స్ వల్లేమో.. నేనసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాను...
Deepika Padukone opens up on 'difficult' Covid-19 battle: కరోనాతో పోరాడిన వారిలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె ఒకరు. గతేడాది ఆమెతో పాటు తల్లి ఉజాలా, తండ్రి ప్రకాశ్, సోదరి అనీషా.. ఇలా కుటుంబం మొత్తం కోవిడ్ బారిన పడింది. తాజాగా ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకుంది దీపికా. 'కరోనా అటాక్ తర్వాత నా జీవితమే మారిపోయింది. ఎందుకంటే మహమ్మారి బారిన పడ్డాక నా శరీరంలో చాలా మార్పులొచ్చాయి. నేను వేసుకున్న మందులు, నాకిచ్చిన స్టెరాయిడ్స్ వల్లేమో.. నేనసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాను. నిజంగా కోవిడ్ చాలా భయంకరమైంది. మీ శరీరమే కాదు, మీ మెదడు కూడా చిత్రవిచిత్ర అనుభూతిని పొందుతుంది'
'కరోనా సోకినప్పుడు పెద్ద భయమనిపించలేదు. కానీ దాన్నుంచి బయటపడ్డ తర్వాత నా బుర్ర అసలు పని చేయలేదు. అందుకే రెండు నెలలు షూటింగ్స్‌కు బ్రేక్ చెప్పాను. అది నా జీవితంలోనే అత్యంత క్లిష్టమైన ఫ్లేజ్' అని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే దీపికా నటించిన లేటెస్ట్ మూవీ గెహ్రాయాన్. శకున్ బాత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.