
బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్స్‌లలో దీపికా పదుకొణె ఒకరు. హావాభావాలు, విభిన్నమైన డైలాగ్ డెలివరీతో నటనలో తనదైన ముద్ర వేసుకుంది. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకొణె కుమార్తెగా వెండితెరకు పరిచయమైన తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.
Deepika Padukone Shares Poetry She Wrote In 7th Class: బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్స్‌లలో దీపికా పదుకొణె ఒకరు. హావాభావాలు, విభిన్నమైన డైలాగ్ డెలివరీతో నటనలో తనదైన ముద్ర వేసుకుంది. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకొణె కుమార్తెగా వెండితెరకు పరిచయమైన తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సరసన హీరోయిన్‌గా 'ఓం శాంతి ఓం' సినిమాతో బీటౌన్ ప్రేక్షకులను అలరించింది. త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు జోడిగా 'ప్రాజెక్ట్ కె' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. సినిమాలతో బిజీగా ఉండే దీపికా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా దీపికా పదుకొణె తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
'నేను తొలిసారి, అలాగే చివరిసారిగా రాసిన కవిత. అప్పుడు నేను ఏడో తరగతిలో ఉన్నాను. నాకు 12 ఏళ్లు. మా టీచర్లు మమ్మల్ని రెండు పదాలతో (ఐ యామ్) ఏదైనా కవిత రాయమన్నారు. నేను అవే పదాలతో టైటిల్ పెట్టి కవిత రాశాను. అలా కవిత రాయడం మళ్లీ ఎప్పుడూ జరగలేదు.' అని దీపికా తన కవిత చరిత్ర గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీపికా షారుఖ్ ఖాన్‌తో 'పఠాన్' సినిమాలో నటిస్తోంది. దీపికా పదుకొణె-షారుఖ్ ఖాన్ జంటగా నటించడం ఇది నాలుగోసారి. ఇప్పటివరకు ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాలలో వీరు కలిసి నటించారు.