Is Shanmukh Jaswanth And Deepthi Sunaina Reunion On Feb 14 Valentines Day 2022? - Sakshi
Sakshi News home page

Shanmukh Jaswanth-Deepthi Sunaina: మళ్లీ కలవబోతున్న లవ్‌బర్డ్స్‌? ఆ రోజుకే డేట్‌ ఫిక్స్‌..

Published Tue, Feb 1 2022 9:14 PM | Last Updated on Wed, Feb 2 2022 8:52 AM

Is Deepthi Sunaina And Shanmukh Jaswanth Reunion On February 14th - Sakshi

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్స్‌, యూట్యూబ్‌ స్టార్‌ లవ్‌బర్డ్స్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌- దీప్తి సునయన బ్రేకప్‌ చెప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరూ బ్రేకప్‌ మీడియాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వీళ్లిద్దరూ విడిపోవడానికి కారణమెంటో అందరికి తెలిసిందే. అయితే యూట్యూబ్‌లో, సిరీస్‌లో వీరిద్దరి పేర్‌కు, కెమిస్ట్రికి ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అంతేకాదు ఎంతో కాలం నుంచి వీరిద్దరూ ప్రేమలో మునిగితేలారు. అయితే చిన్న కారణాలకే ఈ యూట్యూబ్‌ జంట విడిపోవడం వారి ఫాలోవర్స్‌ను బాధించింది. దీంతో మళ్లీ వీరిద్దరూ కలిస్తే బాగుండు అని ఫ్యాన్స్‌ తెగ కోరుకుంటున్నారు.

చదవండి: సీనియర్‌ నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం

ఈ క్రమంలో షణ్మఖ్‌ తండ్రి మళ్లీ వీరిద్దరూ కలుస్తారంటూ ఆ మధ్య ఇంటర్వ్యూలో భరోసా వ్యక్తం చేశాడు. కానీ దీప్తి వాలకం చూస్తుంటే మళ్లీ ఆమె షణ్నుతో కలిసేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోందంటూ వారి ఫ్యాన్స్‌ నిరాశ వ్యక్తం చేయగా.. మరికొందరూ కలుస్తారు అంటూ బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14 వాలంటైన్స్‌ డే రోజున షణ్ను-దీప్తిలు కలవబోతున్నారంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు దీనికి బిగ్‌బాస్‌ షో వేదిక కాబోతోందట.

చదవండి: డబ్బు కావాలంటూ మెసేజ్‌లు చేస్తున్న అనుపమ!, హీరోయిన్‌ క్లారిటీ

అదేలా అంటే బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా గ్రాండ్‌ సెలబ్రెషన్స్‌కు ప్లాన్‌ చేశారట. ఆ రోజు అయిదు సీజన్ల బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ను ఆహ్వానించి పెద్ద ఉత్సవం చేయబోతున్నట్లు వినికిడి. ఇదిలా ఉంటే ఇక అదే రోజు బిగ్‌బాస్‌ ఓటీటీ ప్రారంభం కానుందని, ఇందులో బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్స్‌ సందడి చేయబోతున్నారంటూ ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించిన షూటింగ్‌ కూడా ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. దీంతో నిజంగానే బిగ్‌బాస్‌ షణ్ను-దీప్తి కలవబోతున్నారంటూ కోందరూ ఆశభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వేదికపై షణ్ముఖ్-దీప్తిలను జంటగా చూపించబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ విషయం తెలిసి వారి ఫాలోవర్స్‌ తెగ సంబరపడితున్నారు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ ఉత్సవంకు సంబంధించి తొలిపార్ట్‌ షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యిందంటూ మరోవైపు వార్తలు వినిపిస్తున్నారు. ఆ ఈవెంట్‌ ఫొటోలు, వీడియోలు ఇవే అంటూ సోషల్‌ మీడియా బయటకు వస్తున్నాయి. అయితే వీటిలో దీప్తి కానీ, షణ్మఖ్‌ కానీ ఎక్కడా కనిపించలేదు.  

చదవండి: యంగ్‌ హీరోయిన్‌తో హృతిక్‌ సీక్రెట్‌ డేటింగ్‌.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement