
ఊయలలో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్. చారడేసి కళ్లతో గుర్రుగా చూస్తున్న ఈమె బాలీవుడ్‌లో బోలెడన్ని సినిమాలు చేసింది. రామ్‌చరణ్‌తో కలిసి తెలుగులోనూ ఓ సినిమా చేసింది. కానీ ఆ సినిమా ఇక్కడ హిట్ కాకపోవడం, పెద్ద పేరు తీసుకురాకపోవడంతో బాలీవుడ్‌లోనే సెటిలైంది. అక్కడ రాజకీయాలు తట్టుకోలేక హాలీవుడ్‌కు మకాం మార్చింది. ఈ బ్యూటీ ఎవరో ఈపాటికే గుర్తుపట్టి ఉంటారు. ఆమె మరెవరో కాదు ప్రియాంక చోప్రా.
బాత్రూమ్‌లో భోజనం
మంగళవారం(జూలై 18) ప్రియాంక చోప్రా బర్త్‌డే. 1982లో జార్ఖండ్ జంషెడ్‌పూర్‌లో జన్మించిన ఆమె తాజాగా 41వ పడిలోకి అడుగుపెట్టింది. 13 ఏళ్ల వయసులో చదువుకోవడానికి అమెరికా వెళ్లిన ఆమెకు అక్కడ జాతి వివక్ష ఎదురైంది. ఆడిపాడుకునే వయసులో స్నేహితులెవరూ లేరు. నువ్వెక్కడిదానివి? అన్నట్లుగా విసురుచూపులు.. ఇవి తట్టుకోలేక, ఎవరితోనూ కలవలేక బాత్రూమ్‌కు వెళ్లి గబాగబా లంచ్ చేసేది.
తల్లిదండ్రులు ఆర్మీలో
ప్రియాంక తల్లిదండ్రులు మధు- అశోక్ చోప్రా.. ఇద్దరూ ఆర్మీ వైద్యులు. ప్రియాంకకు 4 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె తండ్రికి లేహ్‌లో పోస్టింగ్ ఇచ్చారు. లేహ్‌లో ప్రియాంక కుటుంబం బంకర్‌లో నివసించేది. వీళ్లు ఆర్మీ ఉద్యోగులు కావడంతో తరచూ ప్రదేశాలు మారుతూ ఉండేవారు. అమెరికాలో విద్యాభ్యాసం పూర్తి చేసి వచ్చిన ప్రియాంక కట్టుబొట్టులోనూ మార్పు గమనించాడు ఆమె తండ్రి. తను అంత మోడ్రన్‌గా మారడం అశోక్ చోప్రాకు ఏమాత్రం నచ్చలేదు.
వెంటపడ్డ అబ్బాయి.. కానీ ప్రియాంకకే నిబంధనలు
ఓసారి ఒక అబ్బాయి తన వెంటపడి ఇంటిదాకా వెంబడిచడంతో ప్రియాంక భయపడిపోయింది. ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. ఇలా జరిగినందుకు అశోక్ చోప్రా.. తన కూతుర్నే తిట్టాడు. ఆమె బెడ్‌రూమ్ కిటికీలకు జాలి కొట్టించాడు. తన జీన్స్, వెస్టర్న్ డ్రెస్సులు ఏవీ లేకుండా చేశాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లడాన్ని కూడా నిషేధించాడు. ఇంట్లో కూడా సల్వార్ డ్రెస్సులే వేసుకోవాలని షరతు పెట్టాడు. ఈ విషయాలన్నీ ప్రియాంక ఓ షోలో బయటపెట్టింది. ఈ సంఘటనలేవీ ప్రియాంక ప్రతిభకు అడ్డు రాలేదు. 18 ఏళ్ల వయసులో మిస్ వరల్డ్‌గా కిరీటం అందుకుని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
మూడు చోట్ల సర్జరీ చేసుకోవచ్చుగా
అలా అని తన బాలీవుడ్ ఎంట్రీ అంత సులువుగా ఏం జరగలేదు. దర్శకనిర్మాతలు చెత్త సలహాలిచ్చేవారు. సినిమాల్లోకి వచ్చేముందు ఓ డైరెక్టర్ తనను మూడు సర్జరీలు చేయించుకోమన్నాడట. ఛాతీ, బ్యాక్, దవడ సర్జరీ చేసుకోమని సలహా ఇచ్చాడని ప్రియాంక తన ఆత్మకథ అన్‌ఫినిష్‌డ్‌లో రాసుకొచ్చింది. ఈ సూచనలు తిరస్కరించి.. చివరకు ఎలాగోలా తన ప్రతిభను నిరూపించుకుని వెండితెరపై స్టార్ హీరోయిన్‌గా మెరిసింది. తర్వాత హాలీవుడ్‌కు వెళ్లి అక్కడ కూడా మంచి అవకాశాలు అందుకుంటోంది బ్యూటీ. ఈమె తెలుగులో రామ్‌చరణ్‌తో కలిసి తుపాకీ (హిందీలో జంజీర్) సినిమా చేసిన సంగతి తెలిసిందే!
చదవండి: బోల్డ్ సీన్స్‌తో ఇండస్ట్రీని తన మైకంలో పడేసిన హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment