బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వంటలక్క, డాక్టర్ బాబు అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. టీఆర్పీ రేటింగ్ విషయంలో ఇంతవరకు ఏ సీరియల్ కానీ, షోలు కానీ ‘కార్తీక దీపం’ని అందుకోలేకపోయాయంటే ఈ సీరియల్‌కి ఉన్న క్రేజీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో కూడా ఈ సిరియల్‌పై ఫన్నీ మీమ్స్ వస్తుంటాయి.
తాజాగా 'ఆర్ఆర్ఆర్' కొత్త పోస్టర్‌ను సైతం 'కార్తీకదీపం' స్టైల్ లోకి మార్చి మీమ్స్ క్రియేట్ చేశారు. ఈ సీరియల్ మాత్రమే కాదు.. అందులో నటీనటులు కూడా ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటారు. చైల్డ్ ఆర్టిస్టులు సహృద(హిమ), కృతిక(శౌర్య) నుంచి నిరుపమ్(డాక్టర్ బాబు)వరకు అందరికి సోషల్ మీడియాలో మంచి గుర్తింపు ఉంది.
ముఖ్యంగా సహృద సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా హిమ అలియాస్ సహృద షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ తమ ఇంటికి వచ్చారని చెబుతూ.. ఆయనతో దిగిన ఫోటోని ఇన్‌స్టాలో షేర్ చేసింది సహృద. అయితే ఎందుకు వచ్చారనే విషయాన్ని మాత్రం బయటకు చెప్పలేదు. దీంతో మాజీ మంత్రి ఈటల మీ ఇంటికి ఎందుకు వచ్చారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
Comments
Please login to add a commentAdd a comment