
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కోలివుడ్ స్టార్ హీరో ధనుష్ కలిసి ఓ త్రిభాష చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టుపై ధనుష్ స్పందించారు. ఆయనతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు.
‘నేను ఆరాధించే దర్శకులలో ఒకరు శేఖర్ కమ్ములతో కలిసి పని చేయడం ఎగ్జైటింగ్ గా ఉంది. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు లతో చేతులు కలపడానికి కూడా సంతోషిస్తున్నాను. వి.ఎస్.వి.సి.ఎల్.ఎల్.పి. బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ త్రిభాషా చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను” అంటూ ధనుష్ ట్వీట్ చేశారు. ధనుష్ నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇది. ఇందులో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత ఉందో చూడాలి మరి.
చదవండి:
ఇట్స్ అఫిషియల్: ధనుష్‌తో శేఖర్ కమ్ముల త్రిభాషా చిత్రం
‘జగమే తంత్రం’ మూవీ రివ్యూ
Comments
Please login to add a commentAdd a comment