స్వయంకృషితో ఎదిగిన నటుడు చిరంజీవి. ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరో నుంచి మెగాస్టార్‌గా మారాడు. తనకంటూ లక్షలాది మంది అభిమానులను సృష్టించుకున్నాడు. కుడి చేత్తో చేసే సాయం ఎడమ చేతికి తెలియనివ్వకూడదన్నది చిరు పాలసీ. ఎన్నో గుప్తదానాలు చేశాడు, ఎంతోమందిని సకాలంలో ఆదుకుని ఆపద్భాందవుడయ్యాడు. కానీ ఎన్నడూ తాను సాయం చేశానని మాట వరసకైనా బయటకు చెప్పలేదు. ఇలాంటి వ్యక్తిపై గతంలో విషప్రయోగం జరిగింది.. ఈ విషయాన్ని చాలా కాలం తర్వాత చిరంజీవే బయటపెట్టాడు. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? చిరుపై విషప్రయోగం చేసిందెవరు? దాని వెనక గల కారణాలేంటి? ఈ స్టోరీలో చూద్దాం..
ఆరోజు ఏం జరిగిందంటే?
1988లో చిరంజీవి మరణమృదంగం సినిమా చేశాడు. అప్పటికే బాస్‌కు జనాల్లో పిచ్చి క్రేజ్ ఏర్పడింది. చెన్నైలోని షూటింగ్ లొకేషన్‌కు అభిమానుల తాకిడి ఎక్కువైంది. ఆటోగ్రాఫ్‌లు, ఫోటోలంటూ జనం ఎగబడేవారు. మరణమృదంగం సినిమా చిత్రీకరణలో భాగంగా ఎప్పటిలాగే చిరు ఆ రోజు సెట్స్‌కు వెళ్లాడు. సెట్ బయట అభిమానులు ఎక్కువమంది పోగవడంతో వారికి ఓసారి అభివాదం చేద్దామని వెళ్లాడు మెగాస్టార్.
బర్త్‌డే అంటూ విషం కలిపిన కేక్..
ఇంతలో ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శిస్తూ చిరు కాళ్లపై పడి ఈ రోజు నా పుట్టినరోజు.. మీ సమక్షంలో బర్త్‌డే జరుపుకుంటానంటూ కేక్ కట్ చేశాడు. తర్వాత చిరు వద్దని వారించినా సరే వినకుండా ఆ అభిమాని మెగాస్టార్ నోట్లో కేక్ పెట్టాడు. కానీ దాని రుచి తేడాగా ఉండటంతో వెంటనే దాన్ని ఉమ్మేసి నోరు కడుక్కున్నాడు. అభిమానుల తోపులాటలో అక్కడున్న కేక్ కింద పడిపోగా అందులో రంగురంగుల పదార్థాలు కనిపించాయి.
చిరు పెదాలు నీలిరంగులోకి
ఇంతలో మేకప్ వేసేందుకు వచ్చిన సిబ్బంది చిరు పెదాలు నీలిరంగులోకి మారడాన్ని గుర్తించారు. విషప్రయోగం జరిగిందన్న అనుమానంతో హాస్పిటల్‌కు వెళ్లగా డాక్టర్లు విషానికి విరుగుడు మందులతో పాటు వాంతులయ్యేలా టాబ్లెట్లు ఇచ్చి విషాన్ని తొలగించారు. అలా చిరు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే కేక్ కట్ చేసిన వ్యక్తిని చిత్రయూనిట్ వెతికి పట్టుకుని నాలుగు తన్ని ఎందుకిలా చేశావని నిలదీయగా.. తనతో చిరు మాట్లాడట్లేదనే అలా చేసినట్లు చెప్పాడట. చిరు వేరేవాళ్లతో క్లోజ్‌గా ఉంటే చూడలేకపోతున్నానని, ఆయన తనకే దగ్గరగా ఉండాలనే అలా చేశాడట.
35 ఏళ్ల తర్వాత బయటపెట్టిన మెగాస్టార్
కేరళ నుంచి ఏదో వశీకరణం పౌడర్ తీసుకొచ్చి అందులో కలిపాడట. ఈ విషయం తెలిసి అభిమానులు ఆగ్రహంతో అతడిని కొట్టబోతుంటే చిరు మాత్రం పెద్దమనసు చేసుకుని అతడిని క్షమించి వదిలేశాడు. ఈ విషయాన్ని 35 ఏళ్ల తర్వాత వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ సమయంలో చిరంజీవి బయటపెట్టాడు. అయితే మెగాస్టార్ అంటే గిట్టనివారే ఆయనపై విషప్రయోగం చేసి ఉండవచ్చని ఆ మధ్య మురళీ మోహన్ అనడంతో నిజంగా ఎవరైనా కావాలని చేశారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.
చదవండి: 30 ఏళ్లుగా చిరంజీవికి డూప్‌గా నటించిన ఈ వ్యక్తి గురించి తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment