
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు
Hero Rajasekhar Father Is No More: టాలీవుడ్ హీరో రాజశేఖర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి వరదరాజన్ గోపాల్(93) గురువారం సాయంత్రం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
వరదరాజన్ గోపాల్ చెన్నై డీఎస్పీగా రిటైర్ అయ్యారు. ఆయనకు ఐదుగురు సంతానం కాగా ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వరదరాజన్ రెండో సంతానమే హీరో రాజశేఖర్. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు వరదరాజన్ భౌతిక కాయాన్ని చెన్నైకి తరలించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలోనే జరగనున్నాయి.
Varadarajan Gopal (93) Garu (father of actor @ActorRajasekhar) is no more. Condolences to the family members. RIP @ShivathmikaR @Rshivani_1 pic.twitter.com/uep5nRrpp7
— BA Raju's Team (@baraju_SuperHit) November 4, 2021