ఆసక్తి రేపుతున్న వరుణ్‌ తేజ్‌ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌ | Hero Varun Tej Intresting Announcement About His Next Film | Sakshi
Sakshi News home page

Varun Tej : ఆసక్తి రేపుతున్న వరుణ్‌ తేజ్‌ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌

Published Sat, Sep 17 2022 2:44 PM | Last Updated on Sat, Sep 17 2022 2:54 PM

Hero Varun Tej Intresting Announcement About His Next Film - Sakshi

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌. రీసెంట్‌గా ఎఫ్‌-3 సినిమాతో హిట్టు కొట్టిన వరుణ్‌ ప్రస్తుతం ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. ఇది సెట్స్‌పై ఉండగానే వరుణ్‌ తన నెక్ట్స్‌ మూవీ కూడా ఓకే చేసినట్లు సమాచారం. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో, రియల్‌ ఇన్సిడెంట్స్‌ని బేస్‌ చేసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వరుణ్‌ ట్విటర్‌ ద్వారా ప్రకటించాడు.

దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ వీడియోలో వరుణ్‌ ఏదో స్క్రిప్ట్ చదువుతున్నట్టుగా కనిపిస్తాడు. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఆకట్టుకుంటుంది. తన కెరీర్‌లో 13వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్‌ చేస్తున్నారు? హీరోయిన్‌ ఎవరన్న వివరాలు మరో రెండురోజుల్లో అనౌన్స్‌ చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement