
జెర్రీ పాత్రకు గుడ్ బై చెప్పారు జాన్వీ కపూర్. సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వంలో జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గుడ్‌లుక్ జెర్రీ’. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు జాన్వీ. ‘‘గుడ్‌లుక్ జెర్రీ’ సినిమా షూటింగ్ పూర్తయిందంటే నమ్మలేకపోతున్నాను. ఇలా మొదలుపెట్టి అలా పూర్తి చేసినట్లు ఉంది. ఈ సినిమా ప్రయాణంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను.
సెట్లో ఎవరైన కాస్త అసహనంగా కనిపిస్తే వారిని నవ్వించేదాన్ని. చాలా సరదాగా షూటింగ్ చేశాం. టీమ్ అందరినీ మిస్ అవుతున్నందుకు బాధగా ఉంది’’ అని పేర్కొన్నారు జాన్వీ. ‘గుడ్‌లుక్ జెర్రీ’ సినిమా తమిళంలో నయనతార నటించిన ‘కోలమావు కోకిలా’కు హిందీ రీమేక్. ఈ సినిమా కాకుండ ‘దోస్తానా 2’ చిత్రంలో నటిస్తున్నారు జాన్వీ కపూర్.
చదవండి:
వకీల్ సాబ్’తో నా కల నెరవేరింది: తమన్
పుష్ప: విలన్‌గా జాతీయ అవార్డు విన్నర్
Comments
Please login to add a commentAdd a comment