‘జో బైడెన్‌ ఏడాదికి మించి ఉండరు’ | Kangana Ranaut Calls Joe Biden As a Ghajini | Sakshi
Sakshi News home page

షో మొత్తాన్ని కమలా హ్యారిస్‌ నడిపిస్తారు: కంగనా

Nov 9 2020 1:53 PM | Updated on Nov 9 2020 2:09 PM

Kangana Ranaut Calls Joe Biden As a Ghajini - Sakshi

ముంబై: ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ప్రముఖులపై వివాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటి వరకు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రేను టార్గెట్ చేస్తూ‌ వరుస కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాలీవుడ్‌ గేయ రచయిత జావేద్‌ అక్తర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను ఆమె పరువు నష్టం దావా కేసును ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో తాజాగా  ఆగ్రరాజ్యం కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌పై కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనను ఓ గజినీగా పేర్కొంటూ సోమవారం ట్వీట్‌ చేశారు. ‘మొత్తం షోను కమల హ్యారిస్‌ నడిపిస్తారు. ప్రతి అయిదు నిమిషాలకు ఒకసారి డేటా క్రాష్‌ అయిపోయే గజినీ జో బైడెన్‌. ఆయనకు ఇంజెక్ట్‌ చేసిన మందుల వల్ల ఏడాదికి మించి ఉండరు. ఇక షో మొత్తాన్ని కమలా హ్యారిష్‌ నడిపించడం ఖాయం’ అంటూ కంగనా ట్వీట్‌ చేశారు. (చదవండి: కంగనాకు షాక్‌: మరో కేసు నమోదు)

అదే విధంగా ఒక మహిళ ఎదిగినప్పుడు ఆ మహిళ ఇతర మహిళలకు మార్గాన్ని చూపిస్తుందంటూ కమలా హ్యారిస్‌పై ప్రశంసలు జల్లు కురిపించారు. అమెరికా ఉపాధ్యాక్షురాలిగా బాధ్యతలను స్వీకరించబోతున్న కమలా.. తాను బాధ్యతలను స్వీకరించబోతున్న తొలి మహిళనే కావచ్చు కానీ చివరి మహిళను మాత్రం కాదంటూ కమలా చేసిన వ్యాఖ్యలను కంగనా స్వాగతించారు. అయితే ప్రస్తుతం కంగనా జయలలిత బయోపిక్‌ ‘తలైవి’ షూటింగ్‌తో పాటు తన తదుపరి చిత్రం ‘తేజాస్‌’ కోసం  శిక్షణ తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement