Kanishka Soni About Pregnancy Rumours: I Am Not Self Pregnant Like I Am Self Married - Sakshi
Sakshi News home page

Kanishka Soni: బుల్లితెర నటి ప్రెగ్నెంట్‌? పెళ్లైంది కానీ భర్త లేడుగా!

Published Wed, Nov 9 2022 7:50 PM | Last Updated on Wed, Nov 9 2022 8:21 PM

Kanishka Soni about Pregnancy Rumours: I am Not Self Pregnant Like I am Self Married - Sakshi

'ప్రేమకు అర్థం ఏదంటే.. నిన్నూ, నన్నే చూపిస్తా..' సాధారణంగా ప్రేమికులు, కాబోయే భార్యాభర్తలు ఇలాగే పాడుకుంటూ ఉంటారు. కానీ కొందరు మాత్రం దాన్ని మార్చి.. ప్రేమకు అర్థం ఏదంటే.. నాలో నన్నే చూపిస్తా అని ఆలపిస్తారు. అంటే వారికి వేరొకరి ప్రేమ అనవసరం. తనను తానే ప్రేమించుకుంటారు, ఓ అడుగు ముందుకేసి తనను తానే పెళ్లి చేసుకుంటారు కూడా! అదే స్వీయ వివాహం(సోలోగమి). ఇదిగో ఇలాగే తనను తాను పెళ్లాడింది బుల్లితెర నటి కనిష్క సోని. ఆ మధ్య ఈ తంతుకు సంబంధించిన ఫొటోలు షేర్‌ చేయగా అవి నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి.

ఇకపోతే కనిష్క గర్భం దాల్చిందంటూ ఫిల్మీదునియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ మాటా ఆనోటా ఈనోటా కనిష్క వరకూ వెళ్లింది. దీనికామె తనదైన శైలిలో ఫుల్‌స్టాప్‌ పెట్టింది. 'నన్ను నేను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నాకు నేనుగా గర్భం దాల్చలేను. రుచికరమైన బర్గర్లు, పిజ్జాలు ఇలా ఎన్నో తిన్నాను. దానివల్లే కొద్దిగా లావయ్యానంతే!' అని బదులిచ్చింది. ఈ పోస్ట్‌కు న్యూయార్క్‌లోని పార్క్‌లో సేద తీరుతున్న ఫొటోలను షేర్‌ చేసింది.

చదవండి: కార్తికేయ 2 సినిమా ఒక ఎత్తు, ఆ స్పీచ్‌ ఒక్కటి మరో ఎత్తు
ఆ వివాదంలో విశ్వక్‌సేన్‌దే తప్పు: డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement