
నటుడు సూర్య మరోసారి ద్విపాత్రాభినయం చేస్తారా అన్న ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల విడుదలైన జై భీమ్ ప్రశంసలను అందుకుంటోంది. అలాగే పాండిరాజ్ దర్శకత్వంలో ఎదుర్కుమ్ తుణిందవన్ చిత్రం జనవరిలో విడుదలకు ముస్తాబవుతోంది. వెట్రిమారన్ దర్శకత్వంలో వాడి వాసల్ చిత్రంలోనూ సూర్య నటిస్తున్నారు. కాగా అన్నాత్త ఫేమ్ శివ దర్శకత్వంలో సూర్య నటిస్తున్నారని కోలీవుడ్ టాక్.
ఇందులో∙ద్విపాత్రాభినయం చేయనున్నట్లు, జ్ఞానవేల్ రాజా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా సూర్య ఇంతకు ముందు పేరళగన్, వారణం ఆయిరం, వేల్, మాట్రాన్ చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు.
చదవండి: Suriya Jai Bhim: పార్వతి అమ్మాళ్‌కు సూర్య రూ. 10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్