స్టార్‌ హీరో తనయుడి వేధింపులు? స్పందించిన బేబమ్మ | Krithi Shetty Gives Clarity On Harassed by Star Hero Son Rumour | Sakshi
Sakshi News home page

Krithi Shetty: వెంటపడి వేధిస్తున్న హీరో తనయుడు? క్లారిటీ ఇచ్చిన బేబమ్మ

Published Thu, Jul 6 2023 9:28 PM | Last Updated on Thu, Jul 6 2023 9:29 PM

Krithi Shetty Gives Clarity On Harassed by Star Hero Son Rumour - Sakshi

ఉప్పెన సినిమాతో బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది కృతీ శెట్టి. తనకు వచ్చిన క్రేజ్‌ను రెట్టింపు చేసుకునేలా శ్యామ్‌ సింగరాయ్‌, బంగార్రాజు సినిమాలు చేసి మెప్పించింది. కానీ ఆ తర్వాత కృతీ తడబడింది. వరుస ఫ్లాపులతో సతమతమవుతోంది. ఈ సమయంలో కృతీ శెట్టిని ఓ స్టార్‌ హీరో కుమారుడు వేధించాడంటూ ఓ వార్త వైరలయింది. తన బర్త్‌డే పార్టీకి పిలిచాడని, పార్టీకి వస్తే ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తానని ఆఫర్‌ ఇచ్చాడంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొట్టింది. ఎక్కడికి వెళ్తే అక్కడికి నీడలా వెంబడిసస్తూ, వేధింపులకు గురి చేశాడన్నది సదరు వార్త సారాంశం.

తాజాగా ఈ గాలివార్తపై కృతీ శెట్టి స్పందించింది. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించి జనాల్లోకి తీసుకెళ్లొద్దు అంటూ చేతులు జోడించిన ఎమోజీని జత చేస్తూ సోషల్‌ మీడియా ట్వీట్‌ చేసింది. అసలు ఏమాత్రం సెన్స్‌ లేని ఈ పుకారును లైట్‌ తీసుకుందామనుకున్నాను. కానీ హద్దులు దాటి మరీ ఈ పుకారు అంతటా వ్యాపిస్తోంది. అందుకే ఈ విషయంపై క్లారిటీ ఇస్తున్నా' అని చెప్పుకొచ్చింది.

చదవండి: కైలాస దేశ ప్రధానిగా నిత్యానంద ప్రియ శిష్యురాలు, ఒకప్పటి హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement