బాలీవుడ్ నటి కుషా కపిల సోషల్ మీడియాతో స్టార్‌డమ్ తెచ్చుకున్నారు. కామెడీ కంటెంట్‌తో చిన్న చిన్న వీడియోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఆ తర్వాత సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లోనూ నటించారు. అనంతరం 2017లో కుషా కపిల.. జోరావర్ సింగ్ అహ్లువాలియాను పెళ్లి చేసుకున్నారామె. అయితే తాజాగా తాము విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన కుషా కపిల అభిమానులకు షాకిచ్చింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఓ నోట్ రాసుకొచ్చింది.
(ఇది చదవండి: మరో సినిమా తీసేందుకు రెడీ అయిన 'ది కేరళ స్టోరీ' డైరెక్టర్!)
కుషా కపిల తన ఇన్‌స్టా నోట్‌లో రాస్తూ..'జోరావర్, నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇది ఏ విధంగా చూసినా సరైన నిర్ణయం కాదని తెలుసు. కానీ మా జీవితంలో ఈ సమయంలో ఇది సరైనదేనని భావిస్తున్నాం. మా ప్రేమ, జీవితంలో ప్రతి దానికీ అర్థం ఉంటుంది. కానీ ప్రస్తుతం మేం కోరుకునే విషయాల్లో ఏకీభవించడం లేదు. మేము ఇకపై కలిసి ఉండకూడదని నిర్ణయించుకున్నాం. మా బంధం ముగియడం హృదయానికి బరువుగానే ఉంది. ఇది మాకు, మా కుటుంబాలకు కఠినమైన పరీక్ష. ఇది జరగడానికి మాకు కొంత సమయం ఉంది. ' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. ప్రస్తుతం ఆమె సెల్ఫీ అనే చిత్రంలో నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment