Zorawar Ahluwalia responds to trolls after ex-wife Kusha Kapila announces divorce - Sakshi
Sakshi News home page

Zorawar Singh Ahluwalia: భార్యకు విడాకులు.. ఆమె క్యారెక్టర్‌ గురించి మాజీ భర్త ఏమన్నాడంటే?

Published Wed, Jun 28 2023 4:19 PM | Last Updated on Wed, Jun 28 2023 4:44 PM

Zorawar Singh Ahluwalia Responds on Trolls Ex Wife Kusha Kapila - Sakshi

బాలీవుడ్‌ జంట కుషా కపిల, జొరావర్‌ సిగ్‌ అహ్లువాలియా రెండు రోజుల క్రితం విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇద్దరూ కలిసి తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. వెరసి సదరు నటిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు నెటిజన్లైతే ఏకంగా ఆమె క్యారెక్టర్‌ను తప్పు పడుతూ అసభ్య రీతిలో కామెంట్లు చేస్తున్నారు. దీనిపై ఇంతవరకు నటి స్పందించకపోయినప్పటికీ జొరావర్‌ సింగ్‌ మాత్రం ఆగ్రహంతో ఊగిపోయాడు. తన మాజీ భార్యపై జరుగుతున్న ట్రోలింగ్‌ను సిగ్గు లేని చర్యగా అభివర్ణించాడు.

కలిసే నిర్ణయించుకున్నాం..
ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ పోస్ట్‌ పెట్టాడు. 'కొన్ని విషయాలను మేము ఎంతో పవిత్రంగా ఉంచాలనుకుంటాం. అందులో పెళ్లి ఒకటి. మేమిద్దరం పరస్పరం ఎంతో గౌరవపూర్వకంగా మెదులుతాం. పెళ్లిలాగే విడాకుల నిర్ణయాన్ని కూడా కలిసే తీసుకున్నాం. ఎంతో ఆలోచించాకే ఈ స్టెప్‌ వేశాం. ఇదొక కఠిన నిర్ణయం, కానీ మా ఇద్దరి క్షేమం గురించి ఆలోచించి విడిపోవడమే నయమని నిర్ణయించుకున్నాం. అయితే గడిచిన 24 గంటలుగా కుష గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. ఇది నన్ను బాధకు గురి చేయడమే కాదు చాలా నిరాశ పరిచింది. కుష క్యారెక్టర్‌ను తప్పుపడుతూ ఆమెను విలన్‌గా చిత్రీకరించడం సిగ్గు చేటు' అని మండిపడ్డాడు జొరావర్‌ సింగ్‌.

కెరీర్‌ సాగిందిలా..
కాగా కొంతకాలం పాటు డేటింగ్‌లో ఉన్న కుష కపిల, జొరావర్‌ సింగ్‌ అహ్లువాలియా 2017లో పెళ్లి చేసుకున్నారు. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా పాపులరైన కుష.. ఘోస్ట్‌ స్టోరీస్‌, ప్లాన్‌ ఏ ప్లాన్‌ బి, సెల్ఫీ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే మసాబా మసాబ్‌ 2, మైనస్‌ వన్‌: న్యూ చాప్టర్‌ అనే వెబ్‌ సిరీస్‌లలోనూ తళుక్కుమని మెరిసింది.

చదవండి: వీడియో షేర్‌ చేసిన శ్వేతా బసు ప్రసాద్‌.. అప్పటికీ ఇప్పటికీ అదే అందం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement