నదీతీరంలో తడిచిన అందాలతో కవ్విస్తోన్న హీరోయిన్‌! | Actress Malavika Mohanan Latest Photoshoot White Saree Look Pictures Viral - Sakshi
Sakshi News home page

Malavika Mohanan: నదీతీరంలో తడిచిన అందాలతో కవ్విస్తోన్న హీరోయిన్‌!

Published Fri, Oct 27 2023 7:34 AM | Last Updated on Fri, Oct 27 2023 8:34 AM

Malavika Mohanan Latest White Saree Look Goes Viral - Sakshi

అందాలను ఆరబోయడంలో ఈ తరం హీరోయిన్లు తగ్గేదెలే అంటున్నారు. తెరపైనే కాదు తెరవెనుక తమ సొగసైన పరువాలను ప్రదర్శించడానికి సై అంటున్నారు. దీనివల్ల చాలా ప్రయోజనాలను ఆశిస్తున్నరనే చెప్పాలి. ముఖ్యంగా అవకాశాల వేట.. గ్లామర్‌ షో చేస్తే దర్శక నిర్మాతల దృష్టిలో పడతామని ఆలోచించడం మరో కారణం. ఇక మూడోది అభిమానులను ఆకర్షించడం. అలా మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్‌ను పొందుతూ ఆర్థికంగానూ లబ్ధి పొందుతున్నారు. ఇందుకు ఏ హీరోయిన్‌ అతీతం కాదు.

ఏ చిన్న గ్యాప్‌ దొరికినా వారు తమ గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ ప్రతినిత్యం వార్తల్లో ఉండేలా చూసుకుంటున్నారు. హీరోయిన్‌ మాళవిక మోహన్‌ దారి ఇందుకు భిన్నం కాదు. రజినీకాంత్‌ కథానాయకుడుగా నటించిన పేట చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన మలయాళీ బ్యూటీ తరువాత విజయ్‌ సరసన మాస్టర్‌, ధనుష్‌కు జంటగా మారన్‌ వంటి చిత్రాల్లో నటించారు. అయినప్పటికీ మాళవిక మోహన్‌ ఇంకా తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం పోరాడుతూనే ఉన్నారు.

(నదీతీరంలో తడిచిన అందాలతో వయ్యారాలు పోతున్న మాళవిక మోహన్‌ గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

అందులో భాగంగానే సొగసు చూడతరమా అనేలా తన అందాలను కెమెరా ముందు విచ్చలవిడిగా పరుస్తూ స్పెషల్‌ ఫోటో సెషన్లు తీయించుకుని మరీ వాటిని సోషల్‌ మీడియాలో విడుదల చేస్తున్నారు. అలా తాజాగా తడి తడి అందాలను వివిధ భంగిమల్లో ప్రదర్శిస్తూ తీయించుకున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా ఈ అమ్మడు పా.రంజిత్‌ దర్శకత్వంలో విక్రమ్‌ సరసన నటించిన తంగలాన్‌ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.

చదవండి: 'ఐరనే వంచాలా ఏంటి?'.. ఇప్పుడిదే ట్రెండ్!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement