ఎవరైనా చేయి పట్టుకుంటారా?.. మాళవిక పోస్ట్‌ వైరల్‌ | Malavika Mohanan Fears on Dubbing | Sakshi
Sakshi News home page

Malavika Mohanan: ఎవరైనా నా చేయి పట్టుకుంటారా?.. హీరోయిన్‌ పోస్ట్‌ చూశారా?

Published Fri, Dec 1 2023 8:31 AM | Last Updated on Fri, Dec 1 2023 9:10 AM

Malavika Mohanan Fears on Dubbing - Sakshi

తరచూ తన గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ అభిమానులను ఎంటర్‌ చేస్తూ ఉంటుంది హీరోయిన్‌ మాళవిక మోహన్‌. సినీ నేపథ్యం కలిగిన ఈ కేరళ భామ తొలుత మోడలింగ్‌ రంగంలోకి ప్రవేశించి ఆ తరువాత కథానాయికగా అవతారమెత్తింది. రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన పేట చిత్రంలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించి ఆ తరువాత విజయ్‌కు జంటగా మాస్టర్‌ చిత్రంలో నటించింది.

అదేవిధంగా ధనుష్‌తో మారన్‌ చిత్రంలో యాక్ట్‌ చేసింది. ప్రస్తుతం విక్రమ్‌ హీరోగా పా.రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తంగలాన్‌లో నటిస్తోంది. ఇది కర్ణాటక రాష్ట్రం, కోలార్‌లోని కేజీఎఫ్‌ నేపథ్యంలో సాగే కథా చిత్రం. దీన్ని స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ. జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా మాళవిక నటిస్తుండగా మరో హీరోయిన్‌గా పార్వతి నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన విడుదల చేయనున్నట్లు యూనిట్‌ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ చిత్రంలో మాళవికా మోహన్‌ తన పాత్రకు డబ్బింగ్‌ చెప్తోందట. దీని గురించి ఆమె తన ఎక్స్‌ మీడియాలో పేర్కొంటూ తనకు చిత్ర నిర్మాణంలో అతికష్టమైన భాగం డబ్బింగ్‌ చెప్పడం అని పేర్కొంది. తాను డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు దయచేసి ఎవరైనా తన చేతిని పట్టుకోగలరా అని ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

చదవండి: ‘యానిమల్‌’ మూవీ టాక్‌ ఎలా ఉందంటే.. ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement