Manchu Manoj Visited Kadapa Dargah, Comments On His Life - Sakshi
Sakshi News home page

Manchu Manoj: త్వరలో కొత్త జీవితం ఆరంభించబోతున్నా

Published Fri, Dec 16 2022 7:30 PM | Last Updated on Fri, Dec 16 2022 8:48 PM

Manchu Manoj Visited Kadapa Dargah, Comments On His Life - Sakshi

ఒక్కడు మిగిలాడు (2017) సినిమా తర్వాత మంచు మనోజ్‌ వెండితెరపై కనిపించనేలేదు. అహం బ్రహ్మాస్మి అంటూ ఆ మధ్య పాన్‌ ఇండియా సినిమాను ప్రకటించాడు కానీ తర్వాత దాని గురించి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. దీంతో అతడి అభిమానులు.. అన్నా అసలు సినిమాల గురించి ఆలోచిస్తున్నావా? లేదంటే పక్కన పెట్టేశావా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఈ అనుమానాలకు ముగింపు పలికాడు మనోజ్‌. త్వరలోనే తన రీఎంట్రీ ఉంటుందని ప్రకటించాడు. కడప పెద్ద దర్గాను శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశాడీ హీరో. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎప్పటినుంచో దర్గాకు రావాలనుకుంటున్నానని, చివరికి ఇప్పటికి కల నెరవేరిందన్నాడు. త్వరలో కొత్త జీవితంతో పాటు కొత్త సినిమాలు ప్రారంభిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇందుకోసం మరోసారి కుటుంబంతో వచ్చి ఆ భగవంతుడి ఆశీర్వాదాలు తీసుకుంటానన్నాడు.

చదవండి: కాంతాలగా.. నటి బర్త్‌డే.. ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చిన భర్త
రేవంత్‌ తండ్రి చనిపోయినా బతికే ఉన్నాడని చెప్పాం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement