మంచు విష్ణు, వర్సిటైల్ యాక్టర్ మంచు మోహన్‌బాబు కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుని పలు సేవా కార్యక్రమాలతో పాటు సినిమా రంగంలోని పేద కళాకారులకు సాయం చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో భాగంగానే అయన్ను వారు 'మా అధ్యక్షుడి'గా కూడా ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఆయన 'భక్త కన్నప్ప' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌లో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ఏపీలో పవన్ రాజకీయాలపై
పవన్ రాజకీయాల గురించి చెప్పడానికి నేనే ఏమైనా బ్రహ్మంగారినా..? అంటూ మంచు విష్ణు ఇలా చెప్పుకొచ్చా రు. 'పవన్ సినిమాల గురించి అయితే చెప్పగలుగుతాను. సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఆయన సూపర్ స్టార్. సందేహమే లేదు. పవన్‌కు సంబంధించి ఒక సినిమా ఆడకపోయిన మరో సినిమాలో అయినా మంచి కలెక్షన్స్ వస్తాయి. కానీ ఆయన రాజకీయాల గురించి మాత్రం చెప్పలేను.' అని అన్నారు. రాజకీయాల విషయంలో ప్రజలు చాలా స్మార్ట్‌గా ఉన్నారని మంచు విష్ణు అన్నారు. సినిమా వస్తే చూస్తారు. కానీ ఓటేయాలనుకున్నప్పుడు వాళ్లకు నచ్చిన వ్యక్తికే ఓటేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
సినిమా రంగానికి చెందిన మహానుభావులు లాంటి వారే రాజకీయాల్లో ఓడిపోయారని ఆయన గుర్తు చేశారు. ఒక్కోసారి పాలిటిక్స్‌లో పేరుపొందిన లెజండరీ పర్సన్స్‌ను కూడా ప్రజలు ఓడించారన్నారు. రాజకీయాల ద్వారా ఎవరైతే తన గ్రామాన్ని, తన దేశాన్ని, తన జీవితాన్ని బాగుచేస్తారని నమ్మితే వారివైపే ప్రజలు ఉంటారని ఆయన తెలిపారు. మరో ఆరు నెలలు ఆగితే రాజకీయాల్లో పవన్ భవిష్యత్ ఏమిటనేది చెబుతానని విష్ణు అన్నారు.
(ఇదీ చదవండి: పవన్‌తో విడాకుల టైమ్‌లో జరిగింది ఇదే.. రేణుదేశాయ్ వైరల్ కామెంట్స్)
ప్రస్తుతం తన ఏకాగ్రత సినిమాలపై ఉందని పేర్కొన్నారు. భారీ బడ్జెతో 'భక్త కన్నప్ప' సినిమా తీస్తున్నామని ఆయన ప్రకటించారు. ఇందులో భారీగా ఆగ్ర నటులు ఉంటారని ఆయన తెలిపారు. ఈ సినిమా కోసం తన మార్కెట్‌కు మించి బడ్జెట్ పెడుతున్నామని, అందుకోసం రూ.150 కోట్లకు పైగానే ఖర్చుచేస్తున్నామని మంచు విష్ణు తెలిపారు.
అతను నా తమ్ముడు.. ఏపీ రాజకీయాలపై
తాను చంద్రగిరిలో పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని విష్ణు ప్రకటించారు. అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వాల్లబ్బాయి మోహిత్‌నే చంద్రగిరిలో నిలబడబోతున్నాడని తెలుస్తోంది. మోహిత్ నా తమ్ముడు. అతన్ని నేను చాలా అభిమానిస్తాను. అవసరమైతే అతనికి సపోర్ట్ చేస్తానని కూడా ఆ ఇంటర్వ్యూలో విష్ణు పేర్కొన్నారు. ఏపీలో నవరత్నాలు ప్రోగ్రాం చాలా బాగుంది. దాని వల్ల చాలా మంది పేద ప్రజలు లబ్ధిపొందుతున్నారు. దీనిని బట్టి చూస్తే ఏపీలో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది జగన్‌మోన్ రెడ్డిగారే అని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయాన్ని దేశంలో పేరుపొందిన ఎన్నికల సర్వేలన్నీ తెలుపుతున్నాయని ఆయన గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment