![Mithun Chakraborty And Shruti Haasan To Make a Web Series - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/16/mithun.jpg.webp?itok=jhVP5Xny)
శ్రుతీహాసన్, మిథున్ చక్రవర్తి ముఖ్య పాత్రల్లో హిందీలో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. ‘ది బెస్ట్ సెల్లర్ షీ రోట్’ అనే నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. దీనిని అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయనున్నారు. ఓ సూపర్ స్టార్ నవలా రచయితకూ, అతని ప్రేయసికీ మధ్య జరిగే కథే ఈ నవల. ఇందులో సూపర్‌స్టార్ నవలా రచయితగా మిథున్ చక్రవర్తి, అతని ప్రేయసిగా శ్రుతి కనిపిస్తారని టాక్. మనోజ్ బాజ్‌పాయ్ నటించిన హిందీ చిత్రం ‘మిస్సింగ్’ని తెరకెక్కించిన ముకుల్ అభ్యంకర్ ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేయనున్నారు. సిద్ధార్థ్ పి. మల్హోత్రా నిర్మాత. ఉత్తరాఖండ్‌లో చిత్రీకరణ జరగనున్న ఈ సిరీస్‌ను ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయాలనుకుంటున్నారు. చదవండి: సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది అదే
Comments
Please login to add a commentAdd a comment