
సాక్షి, హైదరాబాద్ : ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే కేసీఆర్‌ను కరోనా ఏమీ చేయలేదని నటుడు మోహన్‌బాబు అన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రెండు రోజుల క్రితం కరోనా సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఫామ్ హౌస్‌లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగి పోతుండటం, వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రోజూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని.. మంగళవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు (మే 1న ఉదయం 5 గంటల వరకు) అమల్లో ఉంటుందని సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా తెలంగాణలో 6,542 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20 మంది మరణించారు. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 898 కేసులు నమోదయ్యాయి.
పోరాట యోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి కే.సి.ఆర్. గారు… ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునే ఆయన్ని కరోనా ఏమీ చేయలేదు. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. @TelanganaCMO
— Mohan Babu M (@themohanbabu) April 20, 2021
చదవండి : తండ్రి కేసీఆర్‌ను కలిసిన మంత్రి కేటీఆర్?
కరోనా కల్లోలం రేపిన ‘నాగార్జునసాగర్ సభ’
Comments
Please login to add a commentAdd a comment