Naina Ganguly Biography In Telugu | Dangerous Hero Movie Naina Ganguly Biography - Sakshi
Sakshi News home page

Naina Ganguly: నో కండీషన్స్‌ అంటున్న 'డేంజరస్‌' హీరోయిన్‌

Mar 6 2022 8:40 AM | Updated on Mar 6 2022 11:07 AM

Naina Ganguly Biography, Filmography - Sakshi

ఏ అమ్మాయికీ  షరతులు పెట్టే పేరెంట్స్‌ కానీ, పర్మిషన్‌ తీసుకునే పరిస్థితి కానీ ఉండకూడదు, రాకూడదు. నిజానికి తను ఎంచుకున్న రంగంలో పనిచేయడానికి, ఎవరి అనుమతి తీసుకోకపోవడమే నిజమైన మహిళా సాధికారత.

‘నయ్‌.. నయ్‌..’ నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు.. అని చెప్పే ఆడపిల్లల తల్లిదండ్రులందరికీ ఓ షార్ట్‌ఫిల్మ్‌తో సమాధానం చెప్పింది నైనా గంగూలీ. స్క్రీన్‌ మీదే కాదు ఈ తీరుతో నిజ జీవితంలోనూ సాగిపోతోంది. ఆమె పరిచయం.. 

కోల్‌కతాలో పుట్టి, ముంబైలో పెరిగిన నైనా గంగూలీని తెర మీదకు తెచ్చింది ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.  ఆమె నటించిన ‘వంగవీటి’ సినిమా, ఆ తర్వాత చేసిన ‘మేరీ బేటీ సన్నీలియోనీ బన్‌నా చాహ్‌తీ హై’ అనే షార్ట్‌ ఫిల్మ్‌.. ఈ రెండూ కూడా విడుదల కోసం ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నాయి. అయితే ఆ అడ్డంకులేవీ ఆమె నటనా ప్రతిభను ఆపలేకపోయాయి.

అవి రిలీజ్‌ కావడానికి ముందే వరుస బాలీవుడ్‌ ఆఫర్స్‌తో బిజీ అయిపోయింది నైనా. ‘చరిత్రహీన్‌’ వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 1,2,3 లలోనూ, ‘డి కంపెనీ’ అనే మరో వెబ్‌ సిరీస్‌లోనూ నటించి మెప్పించింది. ఈ మధ్యనే తిరిగి తెలుగు ప్రేక్షకుల ముందు ప్రత్యక్షమైంది. త్వరలోనే ఆమె నటించిన ‘జోహార్‌’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోన్న  ‘పరంపర’ సిరీస్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది.

ఏ అమ్మాయికీ  షరతులు పెట్టే పేరెంట్స్‌ కానీ, పర్మిషన్‌ తీసుకునే పరిస్థితి కానీ ఉండకూడదు, రాకూడదు. నిజానికి తను ఎంచుకున్న రంగంలో పనిచేయడానికి, ఎవరి అనుమతి తీసుకోకపోవడమే నిజమైన మహిళా సాధికారత.
– నైనా గంగూలీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement