సినిమా హిట్టా ఫట్టా అని లెక్కలేసుకోకుండా క్రేజ్‌ను బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు మన హీరోలు. ఇప్పటికే నాగశౌర్య ఒక్క సినిమాకు నాలుగు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తుండగా తాజాగా నాని కూడా రేటు పెంచినట్లు సమాచారం. గ్యాంగ్ లీడర్‌తో అభిమానులను అలరించిన ఈ హీరో వితో వారిని తీవ్రంగా నిరాశపర్చాడు. అందుకే ఎక్స్‌పెక్టేషన్స్‌ను తగ్గట్లుగా ఈ సారి టక్ జగదీశ్, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాలతో మన ముందుకు వస్తున్నాడు. ఇక ఇప్పటివరకు సినిమాకు పది నుంచి పదకొండు కోట్లు అందుకున్న నాని ఈసారి ఏకంగా పద్నాలుగు కోట్లు కావాలంటున్నాడట. తనతో సినిమా అంటే ఆమాత్రం అయినా ఇచ్చుకోవాల్సిందేనని కరాఖండిగా తేల్చి చెప్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దర్శకనిర్మాతలు కూడా ఈ మొత్తం ఇచ్చేందుకు వెనకడుగు వేయలేదట.
కాగా నాని ప్రస్తుతం రాహుల్ సంక్రీత్యన్‌తో శ్యామ్ సింగరాయ సినిమా చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవితో పాటు ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరోవైపు నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణతో టక్ జగదీష్ చేస్తున్నాడు. ఇందులో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 23న రిలీజ్ అవుతోంది. వివేక్ ఆత్రేయతో అంటే సుందరానికీ అని మరో డిఫరెంట్ సినిమా చేస్తున్నాడు. ఇందులో నజ్రియా నజీమ్ నానితో జోడీ కడుతోంది. ఇక ఈ మూడు సినిమాలకు కూడా నాని రూ14 కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కోట్లు డిమాండ్ చేస్తున్న నాని
Published Mon, Mar 8 2021 2:57 PM | Last Updated on Mon, Mar 8 2021 5:32 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment