మెగా హీరో సాయిధరమ్ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంపై పలువురు సినీ నటులు స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీస్తున్నాయి. సినీయర్ నటుడు నరేశ్ ప్రమాదానికి ముందు సాయి తన ఇంటి నుంచే వెళ్లాడని, బైక్ రేసుల్లో తరచూ తన అబ్బాయి నవీన్, సాయి పాల్గొంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. ఆయన చేసిన కామెంట్స్‌పై పలువురు సినీ ప్రముఖుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బండ్ల గణేశ్, శ్రీకాంత్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీడియోలు వదిలారు. దీనిపై బండ్లకు, నరేశ్‌కు చిన్నపాటి వార్ కాగా తాజాగా నరేశ్, శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలకు రీకౌంటర్ ఇచ్చాడు. ఈ మేరకు నరేష్ తన సోషల్ మీడియా ఖాతాలో వీడియో షేర్ చేశాడు.
చదవండి: నరేశ్ కామెంట్స్ నాకు ఇబ్బందిగా అనిపించాయి: శ్రీకాంత్
ఈ మేరకు నరేష్ మాట్లాడుతూ.. ‘‘శ్రీకాంత్.. నా బైట్ మీద ఇచ్చిన నీ బైట్ చూశాను. అలా ఇచ్చావేంటమ్మా… ఖచ్చితంగా సాయి ధరమ్ తేజ్.. స్పీడ్‌లో లేడు. బురదలో జారీ పడ్డాడు. నేను చెప్పిన మాటలు.. మీడియాలో కాస్త వేరుగా వచ్చాయి. దీంతో పెద్దలు నాకు ఫోన్ చేశారు. వాటికి నేను వివరణ కూడా ఇచ్చాను. బైట్ ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎమోషన్స్ చాలా ముఖ్యం. చనిపోయినవారి గురించి నేను చెప్పలేదు. జనరల్‌గా ఇండస్ట్రీలో జరిగనవి చెప్పాను. బైకులను మనం చాక్లెట్స్ మాదిరిగా పిల్లలకు ఇవ్వం. యాక్సిడెంట్స్ నాకు జరిగాయి. చాలా మందికి జరిగాయి. కానీ నువ్వు మాట్లాడిన విధానం బాధకలిగింది’’ అన్నాడు.
చదవండి: సాయి తేజ్ ఐసీయూ వీడియో బయటకు రావడంపై హీరో నిఖిల్ ఫైర్
‘‘నా కళ్ల ముందు నువ్వు హీరోగా రావడం చూశాను. మంచి సినిమాలు చేశావు. హీరోగా ఎదిగావు. మా ఎలక్షన్స్‌లో పోటీ చేశావు. ఓడిపోయావు. దయచేసి ఇలా ఇంకోసారి బైట్స్ ఇవ్వద్దు. నా బైట్స్‌కు ప్రజలు వేరే విధంగా రియాక్ట్ అవుతున్నారు. గత 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఎప్పుడు బైట్స్ ఇవ్వడంలో కాంట్రావర్సి, పొలిటికల్‌గా చెడ్డ పేరు లేదు. కానీ నువ్వు బైట్స్ ఇచ్చే ముందు ఆలోచించి, పెద్దవారితో మాట్లాడి ఇవ్వు’’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా నరేశ్ కామెంట్స్‌పై శ్రీకాంత్ స్పందిస్తూ... సాయికి జరిగిన యాక్సిండెంట్‌పై నరేశ్ చేసిన కామెంట్స్ తనకు ఇబ్బందిగా అనిపించాయని, ఈ టైంలో ఆయన చనిపోయిన వారి ప్రస్తావన తీయకుండ ఉండాల్సిందన్నాడు. అంతేగాక ఇంకెవ్వరు కూడా ఇలాంటి బైట్‌లు పెట్టొదని, ఈ సమయంలో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉంటారంటూ శ్రీకాంత్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment