ఈ మధ్య ఆ పిచ్చి ఎక్కువైంది: నిహారిక | Niharika Konidela About Not Doing Commercial Movie | Sakshi
Sakshi News home page

Niharika: నా షోలోకి ఉపాసన, సురేఖలను తీసుకొస్తా.. వారితో వంట చేయిస్తా..

Published Mon, Mar 11 2024 1:51 PM | Last Updated on Mon, Mar 11 2024 11:20 PM

Niharika Konidela About Not Doing Commercial Movie - Sakshi

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల యాంకర్‌గా, నటిగా అందరికీ సుపరిచితురాలే. గతంలో హీరోయిన్‌గా కనిపించిన ఈమె ఇటీవలే డెడ్‌ పిక్సెల్స్‌ వెబ్‌ సిరీస్‌ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. వాట్‌ ద ఫిష్‌ అనే సినిమాలోనూ ముఖ్య పాత్రను పోషిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

తిండిపిచ్చి ఎక్కువైంది
'నాకు ఈ మధ్య తిండిపిచ్చి ఎక్కువైంది. పప్పుచారు నా ఫేవరెట్‌. ఈ మధ్య డబ్బులు సేవ్‌ చేసుకుని మరీ ట్రావెలింగ్‌ చేస్తున్నాను. నా వరకు ఏదీ ముందుగా అనుకుని ప్లాన్‌ ప్రకారం వెళ్లను. ఏది చేయాలనిపిస్తే అది చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతున్నాను. నాకు యాక్టింగ్‌ అంటే ఇష్టం. అలా ఇప్పటివరకు నేను చేసిన పాత్రలన్నీ నాకు ఎంతో నచ్చాయి. అయితే నాకు కమర్షియల్‌ సినిమా ఛాన్సులు రాలేదు. ఇప్పటివరకు ఏ డైరెక్టర్‌ నాకు అలాంటి సినిమా ఆఫర్‌ చేయలేదు. అడిగితే చేసేదాన్ని.

ఆడిషన్స్‌ ఇస్తా..
పెద్ద కుటుంబం నుంచి వచ్చాను.. నేనెందుకు ఆడిషన్స్‌ ఇస్తాను అని ఎన్నడూ అనుకోలేదు. ఆడిషన్స్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ ఎవరైనా డైరెక్టర్‌ మంచి సినిమాకు నన్ను ఆడిషన్స్‌కు పిలిస్తే వెళ్తాను కూడా! ఇప్పుడు నేను చేయబోతున్న వంటల షోలో పెద్దమ్మ సురేఖను, వదిన ఉపాసనన తీసుకొచ్చి వారితో వంట చేయించాలని చూస్తున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం' అంది నిహారిక.

చదవండి: హృదయాన్ని  మెలిపెట్టే సినిమా.. కానీ ఆస్కార్‌ దేన్ని వరించిందంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement