తెలుగులో తనిష్‌తో కలిసి ‘మేము వయసుకు వచ్చాం’ సినిమాలో నటించిన నీతి టేలర్ చేసిన మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశారు. ఆ తరువాత పెళ్లి పుస్తకం సినిమాల్లో నటించినప్పటికీ అప్పటి నుంచి సినిమాల్లో ఎక్కువ కనిపించలేదు. అనంతరం టెలివిజన్ స్టార్‌గా మారి బుల్లితెర షోలో మెరిశారు. తాజాగా ఈ భామ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఆగష్టులో తన చిరకాల స్నేహితుడు పరిక్షిత్ భవను వివాహం చేసుకున్నట్లు వెల్లడించింది. తన పెళ్లికి సంబంధించిన ఓ వీడియోను మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు కనిపిస్తోంది. చదవండి: పెళ్లి డేటు చెప్పిన కాజల్ అగర్వాల్
‘మిస్ నుంచి మిసెస్‌గా మారాను. ఈ విషయాన్ని నన్ను అభిమానించే వారందరికి చెప్పాలని అనుకుంటున్నాను. ఆగష్టు 13 2020న పరిక్షిత్‌ను వివాహం చేసుకున్నాను. కోవిడ్ కారణంగా కుటుంబ సభ్యులు దగ్గరి బంధువుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇప్పడు నేను గట్టిగా చెప్పగలను ‘హలో హస్బండ్’ అంటూ పేర్కొన్నారు. అంతేగాక తన జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన పెళ్లి విషయాన్ని సోషల్ మీడియాలో ఎందుకు ఆలస్యంగా వెల్లడించాల్సి వచ్చిందో కారణం కూడా తెలిపారు. ప్రస్తుతం కరోనా పరిస్థితులు నెలకొన్న సందర్భంగా వివాహాన్ని దాచిపెట్టినట్లు పేర్కొన్నారు. కరోనా పూర్తిగా అంతరించిన అనంతరం గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలిపారు. చదవండి: నేహా పెళ్లిపై స్పందించిన మాజీ ప్రియుడు!
కాగా నీతి పెళ్లి వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్ లో ఉంది. ఇందులో మెహెందీ ఫంక్షన్ నుంచి పెళ్లి వరకు జరిగిన పనులను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇదిలా ఉండగా నీతి గతేడాది పరిక్షిత్‌తో నిశ్చితార్థం జరుపుకుంది. అతడు భారత ఆర్మీ కెప్టెన్. అయితే ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిసినప్పటికీ కరోనా మహమ్మారి సమంలో పెళ్లి చేసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. చివరికి నీతి ఇలా ఊహించని విధంగా పెళ్లి అయిపోయిందని చెప్పడంతో అభిమానులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment