ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతపడడంతో సినీ ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటుపడ్డారు. ఇక ప్రేక్షకుల నాడిని పసిగట్టిన ఓటీటీ సంస్థలు.. ఢిపరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తున్నాయి. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీలను విడుదల చేస్తున్నాయి. మరి ఈ వీక్‌లో విడుదల కాబోయే చిత్రాలు, వెబ్ సీరీస్‌లు ఏంటో చూద్దాం.
తమిళంలో 2018లో విడుదలైన ‘జుంగా’తెలుగులో విక్రమార్కుడుగా అనువాదమైంది. సాయేషా, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని గోకుల్ తెరకెక్కించారు. విజయ్ సేతుపతి ఇందులో డాన్‌గా కొత్తగా కనిపిస్తున్నాడు.యాక్షన్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ‘విక్రమార్కుడు’మూవీ ఈ శుక్రవారం అంటే జులై 9న ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమ్ కానుంది.
బిగ్‌బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం కీలక పాత్రలో సంజయ్ వర్మ, గరిమా హీరోహీరోయిన్లుగా నటించిన థ్రిల్లర్ మూవీ ‘ఒక చిన్న విరామం’. ఈ శుక్రవారం(జులై 9) నుంచి ఆహాలో స్ట్రీమ్ కానుంది. 2020లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల కోసం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా నటించిన ‘స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ అటాక్’. గుజరాత్‌లోని అక్షర్‌ధామ్ దేవాలయంపై జరిగిన తీవ్రవాదుల దాడి ఘటన ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది.ఈ చిత్రం జీ5 ఓటీటీలో జులై 9న విడుదల అవుతుంది.
ఓటీటీలో వస్తున్న మరికొన్ని చిత్రాల వివరాలు:
నెట్‌ఫ్లిక్స్:
- ఐ థింక్ యు షుడ్ లీవ్ విత్ టిమ్ రాబిన్సన్ (జూలై 6)
- ది వార్ నెక్స్ట్ డోర్(జూలై 7)
- రెసిడెంట్ ఈవిల్: ఇన్ఫెనిట్ డార్క్‌నెస్ (జులై 8)
- హిడెన్ స్ట్ ఆఫ్ గుజరాత్ (జూలై 9)
- ఆప్టికల్: సీజన్ 4 (జూలై 9)
- వర్జిన్ రివర్: సీజన్ 3(జూలై 9)
- క్రాల్(జూలై 11)
- డోరా అండ్ ది లాస్ట్ సిటీ ఆఫ్ గోల్డ్(జూలై 11)
జీ5
- చతుర్ ముఖం (జూలై 9)
- క్రష్ (జులై 9
- లేడీస్ అండ్ జెంటిల్‌మెన్(జూలై 9)
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
- మాన్‌స్టర్ ఎట్ వర్క్ (జూలై 7)
- కాలర్ బాంబ్ (జూలై 9)
ఎమ్‌ఎక్స్ ప్లేయర్
- హిడెన్ టేస్ట్ ఆఫ్ గుజరాత్ (జూలై 9)
బుక్ మై షో స్ట్రీమ్
- వేలుక్కక్క ఒప్పు కా (జూలై 6)
- వన్ ఫర్ ఆల్ (జూలై 9)
Comments
Please login to add a commentAdd a comment