పవర్ స్టార్ పవన్ కల్యాణ్-రానా దగ్గుబాటి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ అప్‌డేట్ వచ్చేసింది. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్‌ను చిత్ర బృందం ఖరారు చేసింది. మూవీ టైటిల్‌పై ఇప్పటి వరకు వచ్చిన పుకార్లకు పుల్‌స్టాప్ పెడుతూ మేకర్స్ ఆదివారం ఉదయం టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు మల్టిస్టారర్‌కు ‘భీమ్లా నాయక్’ అనే పేరును ఖరారు చేసి ఫస్ట్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు.
ఈ ఫస్ట్ గ్లింప్స్ ‘ఒరేయ్ డేనీ.. బయటకు రారా’ అంటూ పవన్ ఫైట్‌తో స్టార్ట్ కాగా.. లుంగి, బ్లాక్ షర్ట్‌తో ఇచ్చిన పవన్ ఎంట్రీ అభిమానుల చేత కేక పెట్టించేలా ఉంది. ‘డేని.. డేనియల్ శేఖర్’ అని రానా తన పేరు చెప్పగానే.. ‘భీమ్లా..భీమ్లా నాయక్.. ఏంటి చూస్తున్నావ్.. కింద క్యాప్షన్ లేదనా!! అక్కర్లేదు బండెక్కు’ అంటూ పవర్‌స్టార్ వేసిన డైలాగ్ ఆకట్టుకుంటుంది.
Here's the First Glimpse of the POWER Storm ⚡#BHEEMLANAYAK is here 🔥
— Shiva Kumar B (@ShivaKumarB22) August 15, 2021
➡️ https://t.co/cEvffUiqhc
Coming to rule your playlists from Sept 2nd!#BheemlaNayak @pawankalyan @RanaDaggubati #Trivikram @MenenNithya @MusicThaman @saagar_chandrak @dop007 @NavinNooli @vamsi84 @venupro pic.twitter.com/OKqAJhoJep
కాగా మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, బీజుమేనన్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీకి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అక్కడ ఈ మూవీ సూపర్‌హిట్ అందుకుంది. ఇందులో పవన్‌కల్యాణ్ భీమ్లానాయక్ అనే పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. బీజుమేనన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్, పృథ్వీరాజ్‌కుమార్ పోషించిన పాత్రలో రానా కనిపించనున్నాడు. ఇక నిత్యామీనన్, ఐశ్వర్యా రాజేశ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సెప్టెంబర్ 2 నుంచి ‘భీమ్లానాయక్’ పాటలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ఈ సందర్భంగా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment