మోస్ట్‌ పాపులర్‌ హీరోగా మరోసారి ప్రభాస్‌.. టాప్‌ టెన్‌ జాబితా ఇదే | Prabhas Again Claims Top Place In Ormax Media India's Most Popular Actor List, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Prabhas Beats SRK: మోస్ట్‌ పాపులర్‌ హీరోగా మరోసారి ప్రభాస్‌

Published Fri, Aug 23 2024 2:38 PM | Last Updated on Fri, Aug 23 2024 3:14 PM

Prabhas Again Top Place In Ormax Media

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లతో రికార్డ్స్‌ క్రియేట్‌ చేశాడు. సలార్‌,కల్కి సినిమాలతో వరుసగా విజయాలను అందుకున్నాడు. ఈ క్రమంలో ఆయన పేరు నెట్టింట వైరల్‌గా మారింది. బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన ప్రభాస్‌ ఇప్పుడు మరో రికార్డ్‌ అందుకున్నాడు.  ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్‌  విడుదల చేసిన మోస్ట్ పాపులర్‌ హీరోల జాబితాలో మరోసారి టాప్‌లో ప్రభాస్‌ నిలిచాడు.  జులై నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా పాపులర్‌ హీరోల జాబితాను తాజాగా ఆర్మాక్స్‌ విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ప్రభాస్‌ టాప్‌లో ఉన్నాడు.

పాపులర్‌ హీరోల లిస్ట్‌లోఒ షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్​, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలను దాటేసి మరోసారి టాప్​ పొజిషన్​లోనే ప్రభాస్‌ కొనసాగుతున్నాడు. ఇక రెండో స్థానంలో కోలీవుడ్​ విజయ్ దళపతి, నాలుగో స్థానంలో సూపర్ స్టార్​ మహేశ్​ బాబు, ఐదో స్థానంలో యంగ్ టైగర్​ ఎన్టీఆర్​, ఏడో స్థానంలో ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్, తొమ్మిది స్థానంలో మెగా పవర్ స్టార్​ రామ్​ చరణ్​, పదో స్థానంలో తలా అజిత్ కుమార్ నిలిచారు. మూడు, ఆరు, ఎనిమిది స్థానాల్లో షారుక్, అక్షయ్​, సల్మాన్ ఖాన్‌ ఉన్నారు.

మే, జూన్‌ నెలల్లో కూడా టాప్‌ వన్‌లో ప్రభాస్ ఉన్న విషయం తెలిసిందే.. ఇప్పుడు  జులైలోనూ అదే స్థానంలో ఉండటంతో నెటిజన్లు, సినీ ప్రియులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 'అదీ ప్రభాస్ రేంజ్​, ఇండియా నెం.1 హీరో అని మరోసారి నిరూపించారు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌పై సెటైర్లు వేస్తున్నారు. కల్కి సినిమా విడుదల సమయం నుంచి ప్రభాస్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది. దీనిని చూసి తట్టుకోలేకనే బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ గురించి   వివాదాస్పద కామెంట్స్‌ చేశారని అభిమానులు చెప్పుకుంటున్నారు. అర్షద్‌ వ్యాఖ్యలను మంచు విష్ణు, శర్వానంద్‌ తప్పుపడుతూ పోస్టులు పెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement