యదార్థ సంఘటన ఆధారంగా 'ప్రభుత్వ జూనియర్‌ కళాశాల' | Prabhutva Junior Kalasala Movie Interesting Facts | Sakshi
Sakshi News home page

Prabhutva Junior Kalasala Movie: ఆయనే మాకు మార్గదర్శకుడిగా మారారు: నిర్మాత

Published Sat, Aug 13 2022 7:39 PM | Last Updated on Sat, Aug 13 2022 7:44 PM

Prabhutva Junior Kalasala Movie Interesting Facts - Sakshi

Prabhutva Junior Kalasala Movie Interesting Facts: ఓ యదార్థ సంఘటన ఆధారంగా, ఆసక్తికరంగా తెరకెక్కిన చిత్రం 'ప్రభుత్వ జూనియర్ కళాశాల'. ఈ సినిమాకు శ్రీనాథ్ పులకురం దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.  ఇది వరకు విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరిదశకు చేరుకున్నాయి. 

నిర్మాత భువన్ రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ.. ''మా డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం చెప్పిన దాని కంటే కూడా సినిమాను ఎంతో గొప్పగా తెరకెక్కించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. నిర్మాతగా మాకు  ఇది మొదటి సినిమానే అయినా.. అంతా తానై  చూసుకున్నాడు దర్శకుడు. నటీనటులు  కొత్తవారు అయినా వారి  నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. మాకు ఆయన మార్గ దర్శకుడిలా మారిపోయారు. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మా డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం గారికి 'ప్రభుత్వ జూనియర్ కళాశాల' సినిమా టీమ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు. 

సినిమా ప్రమోషన్స్ త్వరలోనే ప్రారంభించబోతున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ రోడ్రిగ్జ్ అద్భుతమైన పాటలు అందించారు. అన్ని పాటలు చక్కగా కుదిరాయి. మా సినిమాలో 4 పాటలు ఉంటాయి. ఒకపాట ప్రముఖ గాయని చిన్మయి గారు, ఇంకో పాట ప్రముఖ గాయకులు విజయ్ ఏసుదాస్ గారు పాడారు. అంతేకాకుండా ఈ పాటలకు ప్రముఖ రచయిత సాయి కిరణ్ గారు అద్భుతమైన లిరిక్స్ అందించగా సయ్యద్ కమ్రన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు'' అని తెలిపారు. ఈ చిత్రంలో ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ముఖ్యపాత్రల్లో నటించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement