![Preethi Asrani To Act with Kavin In Kiss Movie - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/3/preeti1.jpg.webp?itok=RXNCvgVX)
నటి ప్రీతి అస్రాణీని మరో అవకాశం వరించింది. మొదట్లో ఈమె శశికుమార్ హీరోగా నటించిన అయోత్తి మూవీలో ఆయనకు జంటగా నటించింది. ఇస్లాం మతానికి చెందిన యువతిగా చక్కని హావభావాలను ప్రదర్శించింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు ప్రీతికి సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు లభించాయి. అంతేకాకుండా ఇటీవల జరిగిన చైన్నె అంతర్జాతీయ చిత్రోత్సవాలలో 'అయోత్తి' సినిమాకు గానూ ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకుంది.
అయితే పెద్దగా సినిమా అవకాశాలు మాత్రం రాలేదు. ఇంతకుముందు తమిళం, తెలుగు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈమె టీవీ సీరియళ్లలోనూ నటించింది. ఒక హిట్ చిత్రంలో నటించినా పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు. అలాంటిది ఈమెకు తాజాగా ఒక చిత్రంలో నటించే అవకాశం వచ్చిందనే ప్రచారం జరుగుతుంది.
ఇంతకుముందు దాదా వంటి హిట్ చిత్రంలో నటించిన నటుడు కవిన్ తాజాగా కిస్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సతీష్ కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో కవిన్‌కు జంటగా ప్రీతి అస్రాణీని ఎంపిక చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
చదవండి: లక్షలు నష్టపోయిన ప్రముఖ నటి.. మరీ అలా భయపెట్టేసరికి!
Comments
Please login to add a commentAdd a comment