Preethi Asrani
-
హీరోయిన్గా మరో ఛాన్స్ కొట్టేసిన సీరియల్ నటి
నటి ప్రీతి అస్రాణీని మరో అవకాశం వరించింది. మొదట్లో ఈమె శశికుమార్ హీరోగా నటించిన అయోత్తి మూవీలో ఆయనకు జంటగా నటించింది. ఇస్లాం మతానికి చెందిన యువతిగా చక్కని హావభావాలను ప్రదర్శించింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు ప్రీతికి సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు లభించాయి. అంతేకాకుండా ఇటీవల జరిగిన చైన్నె అంతర్జాతీయ చిత్రోత్సవాలలో 'అయోత్తి' సినిమాకు గానూ ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకుంది. అయితే పెద్దగా సినిమా అవకాశాలు మాత్రం రాలేదు. ఇంతకుముందు తమిళం, తెలుగు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈమె టీవీ సీరియళ్లలోనూ నటించింది. ఒక హిట్ చిత్రంలో నటించినా పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు. అలాంటిది ఈమెకు తాజాగా ఒక చిత్రంలో నటించే అవకాశం వచ్చిందనే ప్రచారం జరుగుతుంది. ఇంతకుముందు దాదా వంటి హిట్ చిత్రంలో నటించిన నటుడు కవిన్ తాజాగా కిస్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సతీష్ కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో కవిన్‌కు జంటగా ప్రీతి అస్రాణీని ఎంపిక చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Preethi Anju Asrani (@thepreethiasrani) చదవండి: లక్షలు నష్టపోయిన ప్రముఖ నటి.. మరీ అలా భయపెట్టేసరికి! -
కోలీవుడ్‌లో మరో ఛాన్స్ అందుకున్న యశోద నటి
ఏ రంగంలోనైనా సక్సెస్ చాలా ముఖ్యం. విజయంతోనే పేరు, అవకాశాలు. అలా ఇటీవల డాడా చిత్రంతో విజయాన్ని అందుకున్న నటుడు కవిన్ తాజాగా మరో నూతన చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం ద్వారా నృత్య దర్శకుడు సతీష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దీనికి కిస్ అనే టైటిల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా ఇందులో కవిన్‌కు జంటగా కుక్ విత్ కోమాలి ఫేమ్ ప్రీతి ఇస్రాణిని కథానాయకిగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈమె ఇంతకు ముందు కొన్ని చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించింది. ప్రెజర్ కుక్కర్, యశోద, దొంగలున్నారు జాగ్రత్త సినిమాల్లో నటించింది. ఇటీవల శశికుమార్ హీరోగా నటించిన అయోధి చిత్రంలో ప్రీతి ఇస్రాణిని నాయకిగా నటించింది. గత మార్చి నెలలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తన నటనకు మంచి ప్రశంసలు అందుకుంది ప్రీతి. కాగా ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు కవిన్‌కు జంటగా కిస్ చిత్రంలో నటించే అవకాశం వరించింది. ఇందులో నటి కుష్బూ ముఖ్య పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. చదవండి: షూటింగ్లో వీజే సన్నీకి గాయాలు -
అలాంటి పాత్రలే చేస్తా: ప్రీతి అస్రానీ
సినీపరిశ్రమలో వాళ్లు అనుకుంటున్నట్టుగా అక్కడ రాణించాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు.. కూసింత అదృష్టమూ తోడవ్వాలి. అవి ఉన్నాయి కాబట్టే ఇక్కడ ప్రీతి అస్రానీ గురించి మాట్లాడుకుంటున్నాం. ‘పక్కింటి అమ్మాయి’గా తెలుగువారికి పరిచయమైన ఆమెను ఇటు టాలెంట్ అటు లక్.. రెండూ కలసి ఇటు సినిమా, అటు సిరీస్ అవకాశాలతో బిజీగా మార్చేశాయి. ♦ప్రీతి బాల్యం మొత్తం గుజరాత్లో గడిచింది. బీటెక్ పూర్తిచేసి, హైదరాబాద్ ఉంటున్న అక్క మంజు అస్రానీ దగ్గరకు వచ్చింది. ♦మంజు అస్రానీ కూడా నటే. తెలుగులో పలు సీరియల్స్, సినిమాల్లో నటించారు.. నటిస్తున్నారు. ఆమె వల్లే నటనపై ఆసక్తి పెంచుకుంది ప్రీతి. ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండటంతో నటనారంగంలోకి అడుగు పెట్టింది. ♦తెలుగు నేర్చుకుని మరీ నటిస్తోంది. తొలుత కెమెరా ముందుకు వచ్చింది ‘ఫిదా’ అనే షార్ట్ ఫిలిమ్‌తో. అందులో అంధబాలికగా నటించి, మెప్పించింది. తర్వాత తెలుగులో ‘పక్కింటి అమ్మాయి’, తమిళంలో ‘మిన్నాలే’ సీరియల్స్‌తో తన ప్రతిభను చాటుకుంది. దీంతో సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ♦ ‘గుండెల్లో గోదారి’, ‘మళ్ళీరావా’, ‘సీటీమార్’, ‘యశోద’ సినిమాల్లోనూ నటించింది. ఆమె కథానాయికగా వచ్చిన ‘ప్రెషర్ కుక్కర్’ మంచి విజయం సాధించింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోన్న ‘దొంగలున్నారు జాగ్రత్త’, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోని ‘9 అవర్స్’ లతో అలరిస్తోంది. ఓ నటిగా నాకంటూ కొన్ని పరిమితులున్నాయి. వాటిని నేను దాటలేను. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలన్నీ డీసెంట్‌గా, ఫ్యామిలీ ఓరియంటెడ్గానే ఉన్నాయి. నటనకు ఆస్కారమున్న, అర్థవంతమైన పాత్రలు చేయాలన్నదే నా లక్ష్యం! – ప్రీతి అస్రానీ