సినీపరిశ్రమలో వాళ్లు అనుకుంటున్నట్టుగా అక్కడ రాణించాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు.. కూసింత అదృష్టమూ తోడవ్వాలి. అవి ఉన్నాయి కాబట్టే ఇక్కడ ప్రీతి అస్రానీ గురించి మాట్లాడుకుంటున్నాం. ‘పక్కింటి అమ్మాయి’గా తెలుగువారికి పరిచయమైన ఆమెను ఇటు టాలెంట్ అటు లక్.. రెండూ కలసి ఇటు సినిమా, అటు సిరీస్ అవకాశాలతో బిజీగా మార్చేశాయి.
♦ప్రీతి బాల్యం మొత్తం గుజరాత్‌లో గడిచింది. బీటెక్ పూర్తిచేసి, హైదరాబాద్ ఉంటున్న అక్క మంజు అస్రానీ దగ్గరకు వచ్చింది.
♦మంజు అస్రానీ కూడా నటే. తెలుగులో పలు సీరియల్స్, సినిమాల్లో నటించారు.. నటిస్తున్నారు. ఆమె వల్లే నటనపై ఆసక్తి పెంచుకుంది ప్రీతి. ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండటంతో నటనారంగంలోకి అడుగు పెట్టింది.
♦తెలుగు నేర్చుకుని మరీ నటిస్తోంది. తొలుత కెమెరా ముందుకు వచ్చింది ‘ఫిదా’ అనే షార్ట్ ఫిలిమ్‌తో. అందులో అంధబాలికగా నటించి, మెప్పించింది. తర్వాత తెలుగులో ‘పక్కింటి అమ్మాయి’, తమిళంలో ‘మిన్నాలే’ సీరియల్స్‌తో తన ప్రతిభను చాటుకుంది. దీంతో సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి.
♦ ‘గుండెల్లో గోదారి’, ‘మళ్ళీరావా’, ‘సీటీమార్’, ‘యశోద’ సినిమాల్లోనూ నటించింది. ఆమె కథానాయికగా వచ్చిన ‘ప్రెషర్ కుక్కర్’ మంచి విజయం సాధించింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోన్న ‘దొంగలున్నారు జాగ్రత్త’, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోని ‘9 అవర్స్’ లతో అలరిస్తోంది.
ఓ నటిగా నాకంటూ కొన్ని పరిమితులున్నాయి. వాటిని నేను దాటలేను. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలన్నీ డీసెంట్‌గా, ఫ్యామిలీ ఓరియంటెడ్‌గానే ఉన్నాయి. నటనకు ఆస్కారమున్న, అర్థవంతమైన పాత్రలు చేయాలన్నదే నా లక్ష్యం! – ప్రీతి అస్రానీ
Comments
Please login to add a commentAdd a comment