Priyanka Chopra Sells Her Rolls Royce Ghost To Bengaluru Businessman, Deets Inside - Sakshi
Sakshi News home page

Priyanka Chopra: వ్యాపారవేత్తకు కారు అమ్మిన స్టార్‌ హీరోయిన్‌!

Published Fri, Mar 18 2022 8:44 PM | Last Updated on Sat, Mar 19 2022 7:36 AM

Priyanka Chopra Sells Her Rolls Royce Ghost to Businessman, Deets Inside - Sakshi

బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయం తెలిసిందే. ఇటీవలే హాలీవుడ్​ యాక్షన్​ సినిమా ఫ్రాంచైజీలో ఒకటైన 'ది మ్యాట్రిక్స్:​ రిసరెక్షన్స్'​తో అలరించింది. ప్రస్తుతం 'సిటాడెల్' అనే అమెజాన్​ ప్రైమ్​ వీడియో సిరీస్​తో బిజీగా ఉంది.

ఇదిలా ఉంటే ప్రియాంక తన ఫేవరెట్‌ కార్లలో ఒకటైన రోల్స్‌ రాయ్స్‌ ఘోస్ట్‌ కారును అమ్మేసిందంటూ బీటౌన్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న కారును ఆమె ఎందుకు అమ్మసిందంటారా? నిక్‌ జోనస్‌ను పెళ్లాడిన తర్వాత ప్రియాంక అమెరికాలోనే సెటిలైపోయింది. దీంతో ఇక్కడ గ్యారేజ్‌లో తన కారు చాలాకాలంగా ఖాళీగా ఉంటోందని భావించి దాన్ని బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తకు అమ్మేసినట్లు తెలిస్తోంది. ఇంతకీ ఈ కారు ధర ఎంతనుకుంటున్నారు? అక్షరాలా రెండున్నర కోట్లు. ఈ రోల్స్‌ రాయ్స్‌ ఘోస్ట్‌ కారు కొన్న తొలి బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రానే కావడం విశేషం.

చదవండి: ఇంటికి దూరం కానున్న సమంత!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement