
హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనంతపురానికి చెందిన ప్రియాంక మన తెలుగుమ్మాయి కావడం విశేషం. ‘టాక్సీవాలా’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన ఆమె. ఆ వెంటనే ‘తిమ్మరసు’,‘ఎస్.ఆర్.కల్యాణమండపం’ వంటి చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు మంచి విజయం సాధించినప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఫలితంగా ఆమెకు సినిమా ఆఫర్లు కరువయ్యాయి. ప్రస్తుతం అడపదడపా చిత్రాలు చేస్తూ కెరీర్‌ను నెట్టుకొస్తుంది.
చదవండి: టీమిండియాతో జూనియర్ ఎన్టీఆర్.. ఫొటో వైరల్!
ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హీరో పవన్ కల్యాన్‌కు అభిమానిని అని చెప్పుకునే ప్రియాంక ఆయనతో మాత్రం నటించనంటూ షాకింగ్ కామెంట్స్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలన్ని చూస్తాను. ‘తమ్ముడు’ సినిమాని దాదాపు 20 సార్లు పైగా చూశాను. ఇక ఖుషి సినిమా అయితే చెప్పనక్కర్లేదు. ఆ మూవీలోని ప్రతి డైలాగ్ నేను అలవోకగా చెప్పేస్తాను. అంత స్టార్‌డమ్ ఉన్నా ఆయన మాత్రం ఆర్డినరీ మ్యాన్‌లా, చాలా సింపుల్‌గా ఎలా ఉంటారో నాకు అసలు అర్ధం కాదు’ అంటూ అభిమానం చాటుకుంది.
చదవండి: కాకినాడలో వాల్తేరు వీరయ్య టీం సందడి!
ఆ తర్వాత యాంకర్ ఆయనతో నటించే అవకాశం వస్తే చేస్తారా? అని అడగ్గా.. ప్రియాంక ఆసక్తికరంగా స్పందించింది. ‘ఓ అభిమానిగా ఆయనను దూరం నుంచి చూస్తు మురిసిపోతాను. అంతకు మించి ఏం కోరుకోవడం లేదు. ఆయనతో కలిసి నటించాలనే కోరిక నాకు లేదు. ఒకవేళ పవన్ కల్యాణ్‌తో కలిసి నటించే అవకాశం వచ్చిన చేయను. చేయలేను కూడా’ అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చింది. దీంతో ఆమె సమాధానం విని అంతా సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఇకపోతే తాజాగా ఆమె బాలకృష్ణ సినిమాలో ఆఫర్లు కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోయే ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రియాంకను హీరోయిన్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం
Comments
Please login to add a commentAdd a comment