Pushpa Movie Update: Allu Arjun's New Movie Schedule Has Been Changed | పుష్ప షెడ్యూల్‌ మారింది - Sakshi
Sakshi News home page

షెడ్యూల్‌ మారింది

Published Wed, Oct 7 2020 1:20 AM | Last Updated on Wed, Oct 7 2020 12:55 PM

Pushpa Shooting Schedule Has Been Changed - Sakshi

‘పుష్ప’ ప్లానింగ్‌లో చిన్న మార్పు వచ్చిందట. అనుకున్న టైమ్‌ కంటే ఓ నెల ముందే బరిలో దిగాలనుకుంటోందట చిత్రబృందం. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రష్మికా మందన్నా కథానాయిక. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథాంశం ఉంటుంది. అల్లు అర్జున్, రష్మిక ఈ సినిమాలో చిత్తూరు యాసలో సంభాషణలు పలకనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలనుకున్నారు. ఇప్పుడు డిసెంబర్‌లో కాదు నవంబర్‌లోనే సెట్స్‌ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. కేరళ అడవుల్లో ఈ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారట. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement