‘రాశి’ని వెంటాడుతున్న భయం.. ఎందుకో తెలియాలంటే..? | Raashi Khanna Anthapuram All Set To Release | Sakshi
Sakshi News home page

‘రాశి’ని వెంటాడుతున్న భయం.. ఎందుకో తెలియాలంటే..?

Published Thu, Dec 30 2021 8:12 AM | Last Updated on Thu, Dec 30 2021 8:53 AM

Raashi Khanna Anthapuram All Set To Release - Sakshi

Raashi Khanna’s Antahpuram Gearing Up For Release: అదొక అందమైన అంతఃపురం. అందులో ఓ అందాల రాశి. అయితే ఆ అందాల రాశిని ఓ భయంవెంటాడుతుంటుంది. ఎందుకా భయం? ఆ భయానికి కారణం ఎవరు? అనేది తెలియాలంటే ‘అంతఃపురం’ చూడాల్సిందే. ఈ నెల 31న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. రాశీ ఖన్నా ఓ హీరోయిన్‌గా ఆర్య సరసన నటించిన తమిళ చిత్రం ‘అరణ్మణై 3’. సుందర్‌ .సి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఇందులో ఆండ్రియా మరో కథానాయిక.

ఈ చిత్రాన్ని తెలుగులో ‘అంతఃపురం’ పేరుతో గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ విడుదల చేస్తోంది. సుందర్‌ మాట్లాడుతూ – ‘‘అరణ్మణై’ ఫ్రాంచైజీలో వచ్చిన తొలి రెండు చిత్రాలు తెలుగులో ‘చంద్రకళ’, ‘కళావతి’గా విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. మూడో చిత్రం ‘అంతఃపురం’ కూడా విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది. ఇందులోని హారర్, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి’’ అన్నారు. 

చదవండి: నటి అమలాపాల్‌కు అరుదైన గౌరవం..
రామ్‌-చరణ్‌ బాండ్‌.. ఇద్దరూ ఇద్దరే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement