
ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్ రాశీ ఖన్నా తన నటనతో అభిమానుల మనసు దోచుకున్నారు. సుప్రీమ్, జోరు, జిల్, హైపర్, జై లవకుశ, వెంకీ మామ, ప్రతి రోజు పండగే వంటి సినిమాలతో హిట్ సాధించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చకుంటూ వరుస సినిమాలు చేస్తున్నారు. గతేడాది వెంకీ మామ, ప్రతి రోజూ పండగే సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు నటి రాశీ ఖన్నా. ఆ తర్వాత ఈ ఏడాది నటించిన వరల్డ్ ఫేమస్ లవర్‌లో బాక్సాఫీస్ వద్ద బొల్తా పడటంలో రేస్‌లో కొంచెం వెనకపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఏ ప్రాజెక్టుపై సైన్ చేయలేదు. చదవండి: దీపాల కాంతి మీ జీవితంలో వెలుగులు నింపాలి
ప్రస్తుతం రాశీ తమిళంలో ఓ సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలోతెరకెక్కుతున్న చిత్రం తుగ్లక్ స్టార్ సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేశారు. తాజాగా రాశీ ఖన్నా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు వార్తల్లో నిలిచాయి. తను ఇప్పటికీ సింగిల్ అంటూ అభిమానులకు ఆఫర్ ప్రకటించారు. ఓ మీడియా ఇంటారక్షన్‌లో ఆమె మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ప్రేమలో పడలేదని అన్నారు. ప్రస్తుతం కూడా తన మనసులో ఎవరూ లేరని, సింగిల్‌గా ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా ఒకవేళ ఎవరితోనైనా ప్రేమలో పడితే డేటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. తన జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. చదవండి: విజయ్ సినిమా: ఫీమేల్ లీడ్ రోల్‌లో రాశీ
Comments
Please login to add a commentAdd a comment