
‘‘కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ విద్యుత్ చట్టాలను తీసుకువచ్చింది. అవి రైతులకు వరాలు కావు.. మరణ శాసనాలు’’ అని నటులు, దర్శక, నిర్మాత, సామాజిక విశ్లేషకులు ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం రైతన్న. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టాలను రద్దుచేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని పంజాబ్, హర్యానా, బీహార్, మహారాష్ట్రతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఈ కొత్త చట్టాలు రైతులకు మేలు చేస్తాయని, సవరణలు చేస్తాం కానీ రద్దు మాత్రం చెయ్యం అని కేంద్రం అంటోంది. రైతులంటే అంత గౌరవం ఉంటే మీరు తీసుకువచ్చిన వ్యవసాయ, విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని ‘రైతన్న’ చిత్రం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీగారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మార్చిలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment