raitanna
-
దళారీ వ్యవస్థకు దన్ను.. బాబే
సాక్షి, అమరావతి: రైతన్నలు పండించిన ప్రతి ధాన్యం గింజను ఆర్బీకే వ్యవస్థ ద్వారా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతుల దగ్గర నుంచి ఆఖరి గింజ వరకు కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా రైతుల ఖాతాలకే నేరుగా డబ్బులు జమ చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో దళారీ వ్యవస్థను ప్రోత్సహించింది చంద్రబాబేనన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న సీఎం జగన్ ప్రభుత్వంపై ఈనాడు రామోజీరావుకు ఎందుకింత కక్ష? అని ప్రశ్నించారు. రామోజీరావు ఎలాంటి వారో ఆయన తోడల్లుడిని అడిగినా చెబుతారన్నారు. మంత్రి కారుమూరి ఆదివారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబువి అబ్రకదబ్ర హామీలని, నయ వంచనకు ఆయన కేరాఫ్ అని ధ్వజమెత్తారు. రైతులకు చంద్రబాబు ఎంత ద్రోహం చేసినా రామోజీకి కనపడదు, వినపడదు. టీడీపీ పాలనలో దోచుకో దాచుకో పద్ధతిని అనుసరించారు. చంద్రబాబు హయాంలో 2.65 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తే గత నాలుగేళ్లలో సీఎం జగన్ 3.10 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 2014 – 19 మధ్య 17.94 లక్షల మంది రైతులకు రూ.40,236 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి. నాలుగేళ్లలో సీఎం జగన్ 32.78 లక్షల మంది రైతులకు పారదర్శకంగా రూ.58,765 కోట్లు చెల్లింపులు చేశారు. రైతులకు చంద్రబాబు ఎంత ద్రోహం చేసినా, గిట్టుబాటు ధర కల్పించకపోయినా రామోజీరావు, దత్తపుత్రుడు ఏనాడూ మాట్లాడలేదు. చంద్రబాబు ఎంత దుర్మార్గాలకు పాల్పడ్డారో రైతులందరికీ తెలుసు.ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టారు. 2014 ఇన్పుట్ సబ్సిడీ కూడా సీఎం జగన్ వచ్చాకే ఇచ్చారు. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూ్యరెన్స్ ఆ పంట కాలంలోనే ఇస్తున్నాం. తెలంగాణలో ధాన్యాన్ని ఇతరులు ఎవరూ కొనరు. ఆ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఏపీలో స్వర్ణ రకం, ఇతర అన్ని రకాల ను పండిస్తారు. మన దగ్గర పండే ధాన్యాన్ని రైతుల నుంచి ఎంఎస్పీ కంటే ఎక్కువ ధరకు బయ్యర్లు కొనుగోలు చేస్తారు. ఐదేళ్ల నుంచి బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయని కేంద్ర ప్రభుత్వంతో కొనిపించే ఏర్పాట్లు చేశాం. బొండాలను కొనుగోలు చేయాలనుకుంటే కొంత మాత్రమే వచ్చింది. విక్రయించాలని రైతులను కోరినా అమ్మలేదు. కేరళ అడిగిన బొండాలు రకం కూడా కొనుగోలు చేశాం. కేరళలో ఓనమ్ పండుగ వరకు మన రైతులు నిల్వ చేస్తారు. అలా నిల్వ చేయటం వల్ల రూ.1900లకు అమ్మటంతో రైతులకు ఎంతో లాభం వచ్చింది. -
రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది
‘‘దేశానికి అన్నం పెట్టే అన్నదాత రుణం మనందరం తీర్చుకోవాలి. ఎక్కడ రైతు బాగుంటాడో అక్కడ నాగరికత, సమాజం, సంస్కృతి బాగుంటాయి. దేశానికి వెన్నెముక అయిన రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పేదే నా ‘రైతన్న’ చిత్రం’’ అని ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘రైతన్న’ సినిమా ఈ నెల 14న రిలీజవుతోంది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ‘రైతన్న’ నేపథ్యం, ఇతర విశేషాలను నారాయణమూర్తి ఈ విధంగా చెప్పారు. ► ఈ భూమిపైన ఎవరు ఏ వస్తువు తయారు చేసినా వాళ్లే ధర నిర్ణయిస్తారు. అదేం ఖర్మో కానీ ఆది నుంచీ కూడా రైతులకు పెట్టడమే తెలుసు.. దోచుకోవడం తెలియదు.. దాని వల్ల ఇప్పటికీ కూడా మా పంటకు ఇంత ధర ఇవ్వండి అని అడగలేకపోతు న్నారు. అది రైతుల మంచి మనస్సుకు, గొప్పతనానికి నిదర్శనం. దాన్ని ఆసరాగా చేసుకుని దళారులు మార్కెట్లలో రైతుల్ని దోచుకుంటున్నారు. ప్రభుత్వం ఒక ధర నిర్ణయించి, ఆ ధరకు పంటలు కొనుగోలు చేయమని ఆదేశించినా అక్కడున్న సొసైటీల్లోని సిబ్బంది, అధికారులు, మిల్లర్లు తరుగు పేరు చెప్పి దారుణంగా దోచుకుంటున్నారు. పెట్టడమే తప్ప దోచుకోవడం తెలియని రైతులు తమలో తాము కుమిలిపోతున్నారే కానీ ప్రశ్నించలేకపోతున్నారు. మా సినిమాలో వాటిని ప్రశ్నించాం. ► విత్తనాలు, కూలీలు, ఎరువులు, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తీరా పంట చేతికొచ్చాక అమ్మితే గిట్టుబాటు ధర రాక ఆందోళన చెందుతున్నారు. రైతులు పండించిన పంటలతో వ్యాపారం చేసేవాళ్లు కోటీశ్వరులు అవుతున్నారు. కానీ రైతులు మాత్రం బికారీ అవుతున్నారు. దేశానికి రైతే వెన్నెముక అంటారు. కానీ వారు ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నారు? అయినా ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఈ విషయాలనూ ‘రైతన్న’లో ప్రస్తావించాం. ► కరోనా వంటి మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలో అందరూ ఇళ్లల్లోనే ఉన్నారు. కానీ అన్నదాతలు మాత్రం పొలం బాట పట్టి ఏడాదికి మూడు పంటలు పండించి దేశం ఆకలితో బాధపడకుండా చూశారు. అలాంటి రైతులు గిట్టుబాటు ధరలు లేక, సాగు ఖర్చులు రాక అప్పుల బాధతో అర్ధాకలితో ఉంటే పాలకులు పట్టించుకోరా? పంటలకు సరైన మద్దతు ధర వస్తే అన్నదాతలు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? వారి కుటుంబాలు ఎందుకు రోడ్డున పడతాయి? అని ప్రభుత్వాలు ప్రశ్నించుకోవాలి. అన్నదాతలు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితులు వచ్చాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. ► కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల తమకు తీరని నష్టం అని, వాటిని రద్దు చేయాలని ఢిల్లీ వేదికగా అన్నదాతలు ఆందోళనలు చేస్తున్నారు. అయినప్పటికీ కేంద్రంలో మార్పు రావడం లేదు. నూతన వ్యవసాయ సాగు చట్టాలను రెండేళ్ల పాటు అమలు చేయొద్దని, నూతన కమిటీ వేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిందంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలి. రైతులతో పలుమార్లు చర్చలు జరిపిన కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాల రద్దుకు మాత్రం చర్యలు తీసుకోకుండా మళ్లీ మళ్లీ చర్చలకు ఆహ్వానించడంలో ఆంతర్యం ఏంటి? ► కార్పొరేట్ వ్యవసాయం తొలుత లాభదాయకంగా ఉన్నా ఆ తర్వాత వారు చెప్పిన ధరలకే పంటలను అమ్ముకోవాల్సి వస్తుంది.. దీంతో రైతులే వారి పొలాల్లో కూలీలుగా మారాల్సిన పరిస్థితి వస్తుంది. భారతదేశంలో 75శాతం ఉన్న వ్యవసాయం ప్రస్తుతం 52 శాతానికి పడిపోయింది. ఆ 52 శాతంలో 41 శాతం కౌలు రైతులే ఉన్నారు. ‘పంటలకు కనీస మద్దతు ధర లేకపోవడం వల్లే సాగు అప్పులు పెరిగి అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. వారి ఆత్మహత్యలు ఆగాలంటే వారి కష్టానికి అదనంగా 50 శాతం గిట్టుబాటు ధర కల్పించాలి’ అంటూ 2006లో డా.స్వామినాథన్ కమిటీ యూపీఏ ప్రభుత్వానికి నివేదికలు అందించింది.. కానీ ఇప్పటివరకూ అమలు పరచడం లేదు. అవి అమలైతేనే రైతులు సంతోషంగా ఉంటారు. ► బీహార్ రాష్ట్రంలో ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తీసేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. క్వింటాలు (100 కిలోలు) ధాన్యం గతంలో 1800 ధరకు విక్రయిస్తుండగా ప్రస్తుతం 800 రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ప్రభుత్వ కొనుగోలు కేంద్రా లు కచ్చితంగా ఉండాలి. ప్రైవేటు వారు కూడా కనీస మద్దతు ధరకే కొనుగోలు చేసేలా చట్టాలు తీసుకురావాలనే విషయాన్ని కూడా చూపించాం. ► రైతుల సమస్యలేంటి? ప్రభుత్వ వాదనలు ఏంటి? వాటి పరిష్కారం ఎలా? అనే విషయాలను ‘రైతన్న’లో చూపించాం. రైతు కుటుంబంలోని అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు కూడా ముందుకు రానివారు ఉంటే ఆ రైతుల మనోవేదన ఎలా ఉంటుంది? అనే విషయాలను కూడా మా చిత్రంలో ప్రస్తావించాం. రైతులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు... ఇలా అందరూ చూడాల్సిన సినిమా మా ‘రైతన్న’. -
‘రైతన్న’..వారి కష్టాలు కళ్లకు కట్టినట్లు..
‘‘కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చెయ్యాలి. దేశానికి రైతే వెన్నెముఖ అంటారు. కానీ అన్నదాత ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? అనే కథాంశంతో ‘రైతన్న’ సినిమా తీశా. ఈ సినిమాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వంగపండు ప్రసాదరావుగార్లు పాటలు పాడారు.. వారికి నా నివాళులు’’ అని ఆర్. నారాయణ మూర్తి అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘రైతన్న’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా పలువురు రైతు నాయకుల కోసం హైదరాబాద్‌లో ‘రైతన్న’ సినిమాని ప్రదర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మాజీ మంత్రి వడ్డే శోభ నాద్రీశ్వరరావు మాట్లాడుతూ– ‘‘ఈ రోజు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, వారి బాధలు, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాల వల్ల ఎలాంటి కష్టాలు వస్తాయో ‘రైతన్న’ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారు నారాయణ మూర్తి. స్వామినాథన్ కమిషన్ నివేదికను వెంటనే అమలు పరచాలి’’ అన్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్ నాయకులు కోదండ రెడ్డి, చాడ వెంకట్ రెడ్డి, మధు, శ్రీనివాసరెడ్డి, ప్రజాకవి గద్దర్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, కవి అందె శ్రీ, రైతు నాయకులు వెంకట రామయ్య, మల్లారెడ్డి, గోవర్ధన్, సాగర్, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి
‘‘కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ విద్యుత్ చట్టాలను తీసుకువచ్చింది. అవి రైతులకు వరాలు కావు.. మరణ శాసనాలు’’ అని నటులు, దర్శక, నిర్మాత, సామాజిక విశ్లేషకులు ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం రైతన్న. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టాలను రద్దుచేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని పంజాబ్, హర్యానా, బీహార్, మహారాష్ట్రతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఈ కొత్త చట్టాలు రైతులకు మేలు చేస్తాయని, సవరణలు చేస్తాం కానీ రద్దు మాత్రం చెయ్యం అని కేంద్రం అంటోంది. రైతులంటే అంత గౌరవం ఉంటే మీరు తీసుకువచ్చిన వ్యవసాయ, విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని ‘రైతన్న’ చిత్రం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీగారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మార్చిలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. -
రైతన్నల రణ గర్జన
ఆంధ్రప్రదేశ్‌లో రైతన్న పిడికిలి బిగించాడు. భూమి కోసం రణ గర్జన చేస్తున్నాడు. బలవంతపు భూ సేకరణకు తలొగ్గేది లేదని ఉద్యమబాట పడుతున్నాడు. బందరు పోర్టు భూ సేకరణ సంగతులు మాట్లాడతామంటూ వచ్చిన రాష్ట్రమంత్రి కొల్లు రవీంద్ర, లోక్‌సభ సభ్యుడు కొనకళ్ల నారాయణలను కోన గ్రామ ప్రజలు తరిమి ఊరుదాటించారు. శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టు కోసం జారీ అయిన భూ సేకరణ నోటిఫికేషన్ లో పేర్కొన్న 8 గ్రామ పంచాయతీల రైతులు సమావేశం అయ్యారు. ‘ఈ నేల, ఈ గాలి, ఈ ఊరు మాదే, లాక్కోవాలని ముందుకు వస్తే... ఖబడ్దార్, కదనానికి సిద్ధం’ అంటూ తీర్మానించారు. విజయనగరం జిల్లాలో భోగాపురం విమానాశ్రయానికి భూమిని కోల్పోవాల్సి వస్తుందేమో అన్న బాధ.. గుండెల్ని మెలిపెట్టి వెంపడా సూరి అనే రైతు ప్రాణాలు బలితీసుకుంది. ఆగిన మరో గుండె సాక్షి ప్రతినిధి, విజయనగరం: భోగాపురం విమానాశ్రయం కింద తన భూములను కోల్పోవాల్సి వస్తోందనే ఆందోళనతో విజయనగరం జిల్లా భోగాపురం మండలం గూడెపువలస పంచాయతీ వెంపడాపేటకు చెందిన వెంపడా సూరి(53) గుండె ఆగిపోయింది. అధికారులు భూసేకరణకు నోటీసులిచ్చేందుకు సిద్ధపడుతున్నారని సూరి కలత చెందాడు. శనివారం తెల్లవారుజామున ఇంటి వాకిట్లోనే కుప్పకూలిపోయాడు. గతంలో ఇదే మండలంలోని రామచంద్రపేటకు చెందిన వడ్రంగి ముక్కాల త్రినాథ్(43) హఠాన్మరణం చెందాడు. -
ఎరువు.. బరువు
చిన్నబోయిన బోనం - సంబురానికి దూరంగా పల్లెలు - కాలం కలిసిరాకరైతు దిగాలు - పెరిగిన అప్పులు.. చుట్టుముట్టిన కరువు - వృథాగా ముందస్తుగా కొన్న ఎరువులు - విధిలేక తిరిగి విక్రయిస్తున్న రైతులు - తక్కువ ధరకే అమ్ముకుంటున్న దుస్థితి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కరువు దెబ్బకు పల్లెలు కళతప్పాయి. ఈ సమయంలో ఉత్సాహంతో బోనమెత్తాల్సిన వ్యవసాయ కుటుంబాలు.. చేతిలో చిల్లిగవ్వ లేక బిత్తరపోయి చూస్తున్నాయి. వరుణుడి కరుణలేక.. కాలం కలిసిరాక.. కరువు ఉరుముతుండటంతో రైతన్న సంబురాలకు దూరమవుతున్నాడు. ఖరీఫ్ మీద ఆశలు సన్నగిల్లిపోతుండటంతో తెచ్చిన అప్పు ముప్పుగా మారుతోంది.. ఫలితంగా అన్నదాతలు ఆత్మరక్షణలో పడ్డారు. ఖరీఫ్ కోసం ముందస్తుగా కొని దాచుకున్న ఎరువుల భారం దించుకునే పనిలో పడ్డారు. పనికి రాని ఈ ఎరువుల బరువును దించుకునేందుకు రైతులు ఇప్పుడు వాటిని అడ్డికి పావుశేరు చొప్పున అమ్ముకుంటున్నారు. వడ్డీ కిందనైనా యూరియా, డీఏపీ బస్తాలను తీసుకోవాలని షావుకారుల కాళ్లావేళ్లా పడుతున్నారు. రూ. 860కి కొనుగోలు చేసిన పొటాష్‌ను రూ. 450, రూ. 310కి కొన్న యూరియాను రూ. 250 నుంచి 280కే అమ్ముకుంటున్నారు. అన్నీ ముందే సిద్ధం చేసుకున్నా.. జూన్ మాసం రెండో వారం మొదటి పాదంలో రైతులు ఏరువాక సాగుతారు. మే చివరి నాటికి వ్యవసాయ పని ముట్లు సిద్ధం చేసుకుంటారు. వ్యవసాయ క్యాలెండర్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జూన్ మొదటి వారంలో రైతులకు సబ్సిడీ ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచుతుంది. ప్రతి ఏడాది రైతులు ఎరువుల కోసం దుకాణాల వద్ద పడిగాపులు కాచేవాళ్లు. ఈ ఏడాది మంత్రి హరీశ్‌రావు చొరవ చూపి సహకార సంఘాలు, మహిళా సంఘాలు, ఆథరైజ్డ్ ఫెర్టిలైజర్ దుకాణాల్లో సకాలంలో సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచా రు. ఈ ఏడాది మొత్తం 37,276 మెట్రిక్ టన్నుల యూ రియా, 3560 మెట్రిక్ టన్నుల డీఏపీ, 10520 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 1250 మెట్రిక్ టన్నుల ఎంఓపీ ఎరువులను 4.10 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులు కొనుగోలు చేసి భద్రపరుచుకున్నారు. అడ్డికి పావుశేరు లెక్కన అమ్మకం.. మే మాసం చివరి వారంలో జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. వ్యవసాయదారులకు సాగుపై ఆశలు చిగురించాయి. దొరికిన చోటల్లా అప్పు చేసి ఎరువులు కొనుగోలు చేశారు. 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతూ 3 బస్తాల యూరియా, మూడు బస్తాల డీఏపీ, రెండు బస్తాల పొటాష్, పాస్పేట్ కొనుగోలు చేసి భవిష్యత్తు కోసం భద్రపరుచుకున్నారు. ప్రతి రైతు ఎరువుల కోసం రూ. 10 నుంచి 15 వేలు ఖర్చు చేశాడు. పం డిన ధాన్యం షావుకారికే ఇస్తాననే షరతుతో రైతులు రూ.3 నుంచి రూ.5 వడ్డీతో అప్పు చేసి ఎరువులు కొనుగోలు చేశారు. జూన్ మాసం రెండవ వారం చివరలో ఒకటి, రెండు రోజుల పాటు కురిసిన వర్షాలతో రైతులు విత్తనాలు గుప్పించారు. వ్యవసాయ శాఖ అధికారిక రికార్డుల ప్రకారం 2.73 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. కానీ ఇప్పటి వరకు తిరిగి వర్షాలు పడకపోవడంతో మొలకెత్తిన పంట మొలకలు వాడిపోయాయి. తుకాలు నారు దశలోనే ఎండిపోయాయి. కాలం అవుతుందేమోననే ఆలోచనతో ముందస్తు జాగ్రత్తగా కొనుగోలు చేసి దాచిపెట్టిన ఎరువులు గడ్డకట్టిపోవడం, రబీ సీజన్ పై ఆశలు సన్నగిల్లిపోవడంతో రైతులు అడ్డికి పావుశేరు చొప్పున ఎరువులను అమ్ముకుంటున్నారు. వాటిని కూడా కొనే దిక్కు లేకపోవడంతో షావుకారి కాళ్లావేళ్లా పడి వడ్డీ కింద నైనా ఎరువులు తీసుకొమ్మని ప్రాధేయపడుతున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారిగా ఎరువులు ఇస్తామని రైతులు వస్తుండటంతో షావుకారులు కూడా వాటిని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. -
సాగుకు సహకరించని 2014
కాలగర్భంలో మరో ఏడాది గడిచిపోతోంది.. క్షణాలు గంటలై.. గంటలు రోజులై.. రోజులు నెలలై.. నెలలు సంవత్సరమై.. 2014కు కూడా బైబై చెప్పనున్నాం. గతం గతః అనుకుం టే.. ఆ గతంలోని తీపి, చేదు జ్ఞాపకాలెన్నో.. అందులోనూ ఈ ఏడాది రైతన్నకు కలిసిరాలేదు. ఆరంభంలోనే.. విత్తనాలు, ఎరువులు అందక, కరెంటు ‘కట్’కట, రుణాల కోసం రణం చేసినా.. చివరికి యెవుసం ఏడిపించింది. వ్యయప్రయాసాలకోర్చి సాగు చేసిన పంటలను వర్షాభావం కోలుకోకుండా చేసింది. వచ్చిన దిగుబడిని అమ్ముకుందామంటే ప్రభుత్వ ‘మద్దతు’ లేక.. దళారుల దందా తట్టుకోలేక.. చివరికి రైతన్న ‘చితి’కి పోయాడు. ఆరుగాలం కష్టపడే అన్నదాతకు అడుగడుగునా అరిగోసే. దుక్కులు దున్నాలన్నా వేలకు వేలు ఖర్చులు. ఆ దుక్కులు తడవాలంటే ఆకాశం వైపు చూపులు. విత్తనాలు కొనాలంటే కల్తీ బాధలు. అవి విత్తాలంటే తట్టుకోలేని కూలి రేట్లు. రేట్లు పెట్టినా ఒక్కోసారి దొరకని కూలీలు. అక్కడితో ఆగకుండా.. విత్తిన విత్తనాలు మొలకెత్తక.. మొలకెత్తిన మొక్కలకు నీటి తడులు అందక.. వానలు పడక.. కరెంటు సరఫరాలు సరిపడా లేక.. ఇలా వేసిన పంట వేసినట్లుగానే ఎండిపోయి.. నష్టాలను మిగిల్చి.. అన్నదాతను కష్టాల కడలిలో ఉంచే వెళ్లిపోతోంది... 2014. ఈ ఏడాదంతే అన్నదాతకు కలిసిరాలేదు. జిల్లాలో గతేడాది అతివృష్టి తీవ్రంగా నష్టపరిస్తే ఈ ఏడాది అనావృష్టితో వ్యవసాయం కరువు కోరల్లో చిక్కుకుంది. ఖరీఫ్‌లో వర్షాలు కురవలేదు. పంటలు నిలవలేదు. నిలిచిన పంటలకు నీటి తడులు అందక చివరికి పశువులకు మేత అయ్యాయి. ఇక రబీ సాగు అన్న మాటే లేదు. విత్తనాలు, ఎరువుల కోసం ఆందోళన ప్రభుత్వం 33 శాతం రాయితీపై సోయా, వరి, ఇతర పప్పుధాన్యాల విత్తనాలు అందజేశారు. ఖరీఫ్ ఆరంభంలో జిల్లాకు 20 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు(450 గ్రాముల ప్యాకెట్) అవసరం కాగా, 17 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందాయి. జూన్‌లో వర్షాలు కురువకపోవడంతో 10 లక్షల ప్యాకెట్లు మాత్రమే రైతులు కొనుగోలు చేశారు. రెండు నెలలు ఆలస్యంగా వర్షాలు కురవడంతో రెండు, మూడుసార్లు విత్తనాలు విత్తుకున్నారు. సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలతో విత్తుకోవడానికి విత్తనాలు లేక రైతులు ఇబ్బంది పడ్డారు. ఆలస్యంగా కురిసిన వర్షాలతో మొదట వేసుకున్న విత్తనం, ఎరువులు యూరియా, డీఏపీ, పొటాష్ వ ృథాగా పోయాయి. తిరిగి రెండోసారి విత్తుకునేందుకు విత్తనాలు, ఎరువులు దొరక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా యూరియా, డీఏపీ దొరకక పలు మండలాల్లో రైతులు ఆందోళన బాటపట్టారు. పంటకు నీరందని దైన్య స్థితి జూలైలో మొదటిసారి వేసుకున్న విత్తనాలు మొలకెత్తలేదు. ఆగస్టు రెండో వారం నుంచి మరోసారి విత్తనాలు వేసుకున్నారు. మళ్లీ ఆశించిన వర్షాలు కురువలేదు. చిరుజల్లులతో మొలకెత్తిన విత్తనాలను కాపాడుకోవడానికి అన్నదాతలు పడరాని పాట్లు పడ్డారు. వర్షాల జాడలేకపోవడంతో నీరసించిన రైతన్న మొలకలు బతికించుకునేందుకు నీటిని అందివ్వడానికి దూర ప్రాంతాల నుంచి ఎడ్లబండ్ల ద్వారా డ్రమ్ముల్లో నీటిని తీసుకొచ్చి కుండల ద్వారా కూలీలను పెట్టి మొలకకు నీరు పోశారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 9 వరకు వర్షాలు కురవడంతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. పంటలపై ఆశలు వదులుకున్న రైతులు మరోసారి వారి సహనాన్ని పరీక్షించుకునేందుకు తిరిగి మూడోసారి పంటలు విత్తుకున్నారు. పత్తి, సోయాబిన్ పంటలు వేశారు. అప్పటికే వరి విత్తనాలు వేసుకొని నారుమళ్లలో పశువులను వదిలారు. వరి నాట్లు వేసుకునే సమయం దాటిపోయినా కొంతమంది రైతులు మళ్లీ ఏదో చిరు ఆశతో నారు అలికి వరినాట్లు ఆలస్యంగా సెప్టెంబర్‌లో వేసుకున్నారు. కానీ ఫలితం అంతంతే. గ తేడాదితో పోల్చితే వరిసాగు 60 శాతం తగ్గింది. ఖరీఫ్‌కు అందని రుణాలు.. ఖరీఫ్ ఆరంభం నుంచి రుణాల విషయంలో గందరగోళం నెలకొంది. జూన్‌లో పంట పెట్టుబడి విత్తనాలకు ఎరువులకు అయ్యే ఖర్చుల కోసం ఎదురు చూశారు. మాఫీ, కొత్త రుణాలు మంజూరు విషయంలో స్పష్టత రాకపోవడంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పలు చేశారు. గతేడాది 2013-14లో రూ.1,421 కోట్ల రుణాలు 3,16,542 మంది రైతులకు అందించారు. ప్రతి ఏడాది గ్రామీణ బ్యాంకుల్లో ఏప్రిల్ నెలలోనే రుణాలు ఇవ్వడం మొదలవుతాయి. కానీ ఈ ఏడాది ఆగస్టు వరకు కూడా రైతుల చేతికి చిల్లిగవ్వ కూడా అందలేదు. ఈ ఏడాది రూ.2,228 కోట్లని 3.20 లక్షల మంది రైతులకు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.600 కోట్లు పెంచినా, ఖరీఫ్ సమయం ముగిసినా రైతులకు చేతికి అందకపోవడం గమనార్హం. రుణమాఫీలో 25 శాతం మొదటి విడతగా బ్యాంకర్లకు అందజేయగా.. కొత్త రుణాలివ్వకండా పాత బకాయిలను అందులోంచి తీసుకున్నారు. చివరికి వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. ఖరీఫ్, రబీ కలిపి 2,41,849 మంది రైతులకు రూ.1,164 కోట్లు రుణం ఇచ్చారు. ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.1,693 కోట్ల 74 లక్షలు కాగా, రబీలో రూ.534 కోట్ల 86 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ రబీ సాగు చేసే పరిస్థితి లేదు. కొనుగోలు ఆరంభం అధోగతి పత్తి కొనుగోళ్లు గతేడాది కంటే ముందే ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 20న జిల్లాలోని 19 వ్యవసాయ మార్కెట్ యార్డులకు గాను 6 కేంద్రాల్లో ప్రారంభించారు. ప్రభుత్వ మద్దతు ధర తో కొనుగోలు చేయాలని ప్రభుత్వం అదేశాలు ఉన్న సీసీఐ నిరాకరించడంతో ఆరంభంలోనే అధోగతి పాలైంది. పత్తిని ప్రభుత్వ రంగ సంస్థ అయిన సీసీఐ తేమ పేరిట కొర్రీలు విధిస్తూ కొనుగోలుకు నిరాకరించడంతో ప్రైవేట్ వ్యాపారులను రైతులు ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువగా క్వింటాలుకు రూ.3,200 నుంచి రూ.3,400 వరకు చెల్లిస్తామనడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. కనీసం మద్దతు ధర కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో ఆందోళనకు దిగారు. కలెక్టర్ స్పందించ... సీసీఐ అధికారలు, వ్యాపారులతో చర్చలు జరిపి మొదటి రోజు నామామత్రంగా రెండు వాహనాల పత్తిని మాత్రమే కొనుగోలు చేశారు. మరుసటి రోజు నుంచి సీసీఐ తేమ శాతంలో కొంత సడలింపుతో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ నుంచి పత్తి, నవంబర్ నుంచి సోయా కొనుగోళ్లు జరుగుతున్నాయి. -
రైతన్నను ముంచుతున్న ప్రభుత్వం
‘మద్దతు’కు బోనస్ కలిపి పత్తి కొనుగోలు చేయాలి వరంగల్ మార్కెట్‌ను సందర్శించిన కాంగ్రెస్ బృందం వరంగల్ సిటీ : ముందుచూపు లేకపోవడం తో ప్రభుత్వం రైతన్నను నిండా ముంచుతోందని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా కాంగ్రెస్ బృందం కోదండరెడ్డి ఆధ్వర్యంలో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా పత్తి రైతులు ఎదుర్కొంటున్నృఇబ్బందులు, మద్దతు ధర లభించక పడుతున్న అవస్థలు, దళారుల చేతుల్లో మోసపోతున్న తీరును స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సీసీఐ మొక్కుబడిగా కొనుగోలు చేయడం తప్ప చిత్తశుద్ధితో పత్తిని కొనుగోలు చేయడం లేదనే విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు పత్తి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం మక్క రైతుల ఇబ్బందులను సైతం తెలుసుకొని, మార్కెట్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం, సీఎం, రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రులది మాటలు తప్ప చేతలు లేవని, ఇప్పటికే పత్తి సీజన్ ప్రారంభమై రైతులు దళారుల చేతుల్లో దోపిడీకి గురవుతున్నారని అన్నారు. మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ దీనిపై అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, బండా ప్రకాష్, డాక్టర్ హరిరమాదేవి, మందా వినోద్‌కుమార్, దూపం సంపత్, బొంపెల్లి దేవేందర్‌రావు, మీసాల ప్రకాష్, గుండేటి నరేందర్, రామ యాదగిరి, రోకుల భాస్కర్, ఓని భాస్కర్ పాల్గొన్నారు. సీసీఐ అధికారులపై రిపోర్టు పంపించిన జేసీ కాగా, వరంగల్ వ్యవసాయ మార్కెట్ సీసీఐ ఇన్చార్జి అధికారి నాయుడు వ్యాపారులకు వత్తాసు పలుకుతూ రైతుల వద్ద నుంచి సరిగా పత్తి కొనుగోలు చేయడం లేదని జేసీ ప్రభుత్వానికి రిపోర్టు పంపించినట్లు తెలిసింది. రైతులను ఆదుకోవాలి : కాంగ్రెస్ హన్మకొండ అర్బన్ : రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ నేతల బృందం కలెక్టర్ జి.కిషన్‌ను కోరింది. ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 76 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. అలాగే ఎన్పీడీసీఎల్ సీఎండీ కె.వెంకటనారాయణను కూడా కలిసి వినతిపత్రం అందజేశారు. -
‘గోవాడ’ రైతులకు చేదు కబురు
మద్దతుధరపై నిరాశమిగిల్చిన యాజమాన్యం నిరసన వ్యక్తం చేసిన రైతులు ఫ్యాక్టరీలో అవినీతి ఆరోపణలపై విచారణకు ఎమ్మెల్యే డిమాండ్ చోడవరం : గోవాడ సహకార చక్కెరమిల్లు మహాజనసభ సభ్యరైతులను నిరాశపరిచింది. గిట్టుబాటు ధర కోసం ఆశగా ఎదురుచూసిన రైతన్నలకు యాజమాన్యం ప్రకటన తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. రానున్న సీజన్‌కు సంబంధించి మద్దతు ధర ప్రకటించకపోగా, గతేడాది సరఫరా చేసిన చెరకు టన్నుకు రూ.2350 మాత్రమే చెల్లిస్తామని చైర్మన్ గూనూరు మల్లునాయుడు తెలిపారు. గోవాడ సుగర్స్ 44వ మహాజన సభ ఫ్యాక్టరీ ఆవరణంలో సోమవారం జరిగింది. తొలుత 2013-14 నివేదికను ఎమ్డీ వి.వి.రమణరావు చదివి వినిపించారు. అనంతరం 2014-15 అంచనా నివేదికను వివరించారు. అధ్యక్షోపన్యాసంలో చైర్మన్ మల్లునాయుడు మాట్లాడుతూ ఫ్యాక్టరీ అభివృద్ధికి చేపట్టిన చర్యలను వివరించారు. ఫ్యాక్టరీని 4వేల టన్నులకు విస్తరిస్తున్నామన్నారు. మార్కెట్లో పంచదారకు ధర ఆశాజనకంగా లేకపోవడంతో గిట్టుబాటు ధర ఎక్కువగా ఇవ్వలేకపోతున్నామన్నారు. ఫ్యాక్టరీలో లోపాలు, మద్దతు ధరపై పలువురు రైతులు సభలో మాట్లాడారు. మా డుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ మద్దతు ధరను రూ.2800కు మించి చెల్లించాలన్నారు. మదుపులు బాగా పెరిగిపోయినందున కనీసం రూ.2600లయినా ఇవ్వాలన్నారు. మూడేళ్ల కిందట టన్నుకు రూ.2500లు ఇవ్వాలని ఎమ్మెల్యే రాజు, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు డిమాండ్ చేశారని, అధికారంలో ఉన్న వీరు ఇప్పుడు మద్దతు ధర కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల న్నారు. మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు మాట్లాడుతూ ప్రస్తుతం 5వేల టన్నుల కెపాసిటీకి ఫ్యాక్టరీని ఆధునీకరించాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న మిషనరీని సక్రమంగా వినియోగించుకుంటే సరిపోతుందన్నారు. చంద్రబాబు గతంలో సుగర్ ఫ్యాక్టరీలను అమ్మేయాలని చూశారని, వైఎస్ రాజశేఖరరెడ్డి చెరకు రైతులను ఆదుకొని ఫ్యాక్టరీలను నిలి పారన్నారు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏటా టన్నుకు రూ.200లు చొప్పున రైతులకు ప్రోత్సాహకం ఇచ్చిందని, అధికార పార్టీ పాలకవర్గం, ఎమ్మెల్యేలు సీఎంపై ఒత్తిడి తెచ్చి దానిని కొనసాగించాలన్నారు. ఈ సీజన్‌కు టన్నుకు రూ. 2800 మద్దతు ధర ఇవ్వాలన్నారు. కో-జనరేషన్ ద్వారా ప్రభుత్వానికి అమ్మే కరెంటు ధర పీపీని రద్దు చేసి యూనిట్‌కు రూ. 9 ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ధర్మశ్రీ చెప్పారు. ప్రతి పక్షాలు ఎప్పుడూ ప్రభుత్వంపై పోరాటం చేయాలని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అన్నారు. అవినీతి అరోపణలపై విచారణ చేపట్టాలి: ఎమ్మెల్యే రాజు గోవాడ సుగర్ ప్యాక్టరీలో అవినీతి చోటుచేసుకుం దంటూ పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై విచారణ కమిటీ వేయాలని చోడవరం ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు డిమాండ్ చేశారు. ఆరోపణలు నివృత్తిచేసుకోకపోతే పాలకవర్గానికి చెడ్డపేరు వస్తుందన్నారు. ఇందుకు తక్షణం కమిటీని వేయాలన్నారు. టన్నుకు రూ.2500 మద్దతు దర ఇవ్వాలని డిమాండ్ చేశారు. తీర్మానాలు : మహాజనసభలో పలు తీర్మానాలు చేశారు. 2013-14 క్రషింగ్ సీజన్‌కు టన్నుకు రూ.2350 మద్దతు ధరను చైర్మన్ మల్లునాయుడు ప్రకటించారు. రోజువారీ క్రషింగ్ సామర్థ్యం పెంచేం దుకు రూ.24కోట్లతో ఆధునికీకరణకు ప్రతిపాదన, కరెంటు పీపీ రద్దు, పంచదార అమ్మకాలపై వ్యాట్ రద్దు, మొలాసిస్ అమ్మకాలపై అదనపు పన్ను రద్దు, ఫ్యాక్టరీ ప్రాంగణాన్ని గ్రీన్ బెల్టుగా రూపొందించే పనులకు సమావేశంలో ఆమోదం తెలిపారు. రైతులకు ప్రోత్సాహకాలు : మునుపెన్నడూలేని విధంగా సభ్యరైతులకు ఫ్యాక్టరీ నిధులతో ఒకొక్కరికి ఒక స్టీల్ క్యారేజ్‌ను ప్రోత్సాహకంగా అందజేసింది. వీటిని సభలో నాయకులు రైతులకు అందజేశారు. ఉత్తమ రైతులకు సత్కారం : ఫ్యాక్టరీ పరిధిలో ఆధునికీకరణ పద్ధతులు పాటిస్తూ మంచి దిగుబడి సాధించిన ఇద్దరు రైతులను సభలో సత్కరించారు. వారాడకు చెందిన యడ్ల తాతయ్యలు, సింహాద్రిపురం శివారుకు చెందిన సబ్బవరపు వెంకటరమణలను సన్మానించారు. -
రైతన్న రాజ్యం 20th August 2013