
మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో ఇండస్ట్రీకి వచ్చినవాళ్లు ఎంతోమంది. అందులో నటుడు రాజారవీంద్ర ఒకరు. ఆయనను అమితంగా ఆరాధించే రాజా రవీంద్ర తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'చిరంజీవి అన్నయ్యకు విపరీతమైన మెచ్యురిటీ ఉంటుంది. మనం ఏదైనా మాట్లాడినప్పుడు కామెడీగా అంటున్నామా? కావాలని అంటున్నామా? అనేది ఆయనకు ఇట్టే తెలిసిపోతుంది. అలా ఓసారి నాకు ఆచార్య షూటింగ్‌లో తిట్లు పడ్డాయి'
'అన్నయ్య నాకెంతో క్లోజ్.. అయినా సరే ఎప్పుడు సమయం దొరికినా ఆయన్ని తదేకంగా అలాగే చూస్తాను. ఆచార్య షూటింగ్‌లో అన్నయ్య ఎదురుగా కూర్చుని అలాగే చూస్తున్నాను. దరిద్రం, ఎన్నిసార్లు చెప్పినా వీడు అలా చూడటం మానడు అని తిట్టాడు. నేను నవ్వాను. ఎందుకు నవ్వుతున్నావు? అని అడిగితే మీరు తిట్టినా బాగుంటుందని చెప్పాను. దానికాయన ఖర్మ.. వెళ్లి అక్కడ కూర్చో అన్నాడు. నిజంగానే ఆయనకు ఇబ్బందిగా ఉంటుంది కానీ, నాకు బాగుంటుంది' అని చెప్పాడు రాజా రవీంద్ర.
Comments
Please login to add a commentAdd a comment