RRR Movie Budget: రాజమౌళి అంటే సక్సెస్ సింబల్. హై బడ్జెట్ మూవీస్ కి కేరాఫ్. అంతేకాదు.. ప్రమోషన్ స్ట్రాటజీలో ఎక్స్ పర్ట్. రాజమౌళి ప్రమోషన్ ప్లానింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. బాహుబలితో అది క్లియర్ గా ప్రూవ్ అయింది. ఆర్‌ఆర్‌ఆర్ విషయంలో మాత్రం అంతకు మించి.. అన్నట్టుగా వ్యవహరించబోతున్నాడట జక్కన్న. కేవలం ప్రమోషన్స్ కోసమే రూ.20 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు తెలుసుస్తోంది. అంత భారీ మొత్తాన్ని ఎందుకు వెచ్చించబోతున్నారు? అని ఆలోచిస్తే.. అందుకు రీజన్స్ కూడా చూపెడుతున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ఇండియావైడ్ గా రిలీజ్ కాబోతుంది. కాబట్టి దేశంలో ఉన్న పెద్ద నగరాల్లో ప్రమోషన్ మొదలుపెట్టాలని భావిస్తున్నారట. అందుకోసం భారీ ఎల్ ఈడీ స్క్రీన్లు వాడబోతున్నారు. భారీ సెట్లు కూడా వెయ్యబోతున్నారు. ఇక స్టార్స్ ప్రయాణాల కోసం ప్రత్యేకమైన చార్టెడ్ ఫ్లైట్స్ వేస్తున్నారట. కాబట్టి.. ఖర్చు మామూలుగా ఉండదని తెలుస్తోంది. నార్త్ లో ఉన్న క్రేజీ టీవీ షోస్ తో పాటు, సోషల్ మీడియాలో కూడా ప్రమోషన్ ను ఉరకలుపెట్టించే పనిలో ఉన్నారట.
కోవిడ్ దెబ్బ ఆర్‌ఆర్‌ఆర్‌పై పడిందని దాదాపు 150 కోట్ల బడ్జెట్ అదనంగా అయిందని టాక్ నడుస్తోంది. దాన్ని పూడ్చుకోవాలంటే ప్రమోషన్ ద్వారానే సాధ్యమవుతుందని రాజమౌళి టీమ్ భావిస్తోందట. త్రిబుల్ ఆర్ మొత్తం బడ్జెట్ 550 కోట్ల పై మాటే అని తెలుస్తోంది. వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టాలన్న ప్లాన్ తో రాజమౌళి టీం పథకాలు రచిస్తోంది. మరి 2022 సంక్రాంతి రేసులో దిగుతోన్న ఆర్‌ఆర్‌ఆర్... బడ్జెట్ లక్ష్యాన్ని చేరుకుంటుందో లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment