రజనీకాంత్‌ సినిమాలో అమితాబ్‌, రానా? | Rajinikanth 170 Film Latest Update | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌ సినిమాలో అమితాబ్‌, రానా?

Published Sat, Sep 23 2023 1:26 PM | Last Updated on Sat, Sep 23 2023 1:48 PM

Rajinikanth 170 Film Latest Update - Sakshi

వరుస ఫ్లాప్‌లతో నిరుత్సాహంగా ఉన్న రజనీకాంత్‌కు ఊహించనంతగా జైలర్‌ చిత్రం విజయాన్ని సాధించడంతో ఆయనలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసిందనే చెప్పాలి. ఇటీవలే తనకు ఇష్టమైన ఆధ్యాత్మిక ప్రదేశమైన హిమాలయాలను కూడా చుట్టివచ్చిన రజనీకాంత్‌..  ఇప్పుడు తన 170వ చిత్రానికి రెడీ అయిపోతున్నారు. జై భీమ్‌ చిత్రం జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్‌న్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబచ్చన్‌, టాలీవుడ్‌ స్టార్‌ నటుడు రానా దగ్గుపాటి, మలయాళ స్టార్‌ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌, నటి మంజువారియర్‌ వంటి ప్రముఖ తారాగణం నటించడానికి సిద్ధమవుతున్నారని సమాచారం.

అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌న్స్‌ కార్యక్రమాలు ఇప్పటికే జరుగుతున్నట్లు తెలిసింది. చిత్రం అక్టోబర్‌ మొదటి వారంలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో షూటింగ్‌ ప్రారంభించి, కన్యాకుమారి, నాగర్‌కోయిల్‌ ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ఒక యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌ మరోసారి పోలీస్‌ అధికారిగా నటించడానికి సిద్ధమవుతున్నారు.

ఆయన ఇందులో కన్యాకుమారి ప్రాంత యాసలో మాట్లాడతారని సమాచారం. కాగా ఈయన తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహిస్తున్న లాల్‌ సలామ్‌ చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా రజనీకాంత్‌ ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను కూడా పూర్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement