
చిన్న సినిమాగా విడుదలైన కాంతార పాన్ ఇండియా లెవల్‌లో విజయం సాధించింది. కన్నడ ప్రేక్షకులే కాకుండా పరభాషా ప్రేక్షకులు సైతం కాంతారకు నీరాజనాలు పలుకుతున్నారు. సినిమా చూసి ఔరా అనని సెలబ్రిటీ లేడంతే అతిశయోక్తి కాదు. తాజాగా తలైవా రజనీకాంత్ కాంతారపై ప్రశంసలు కురిపించాడు. 'తెలిసినది గోరంత తెలియనిది కొండంత.. ఈ విషయాన్ని సినిమాల్లో మీకంటే బాగా ఎవరూ చెప్పలేరు' అని నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్‌ను కొనియాడారు.
'కాంతార చిత్రం నా రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఇండియన్ సినిమాలోనే ఇదొక మాస్టర్ పీస్. రచయిత, దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి టాలెంట్‌కు హ్యాట్సాఫ్, చిత్రయూనిట్‌కు అభినందనలు' అని ట్వీట్ చేశాడు రజనీకాంత్. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. తర్వాత దీన్ని ఇతర భాషల్లోనూ డబ్ చేశారు. అలా తెలుగులో అక్టోబర్ 15న రిలీజై ఇక్కడ కూడా ఘన విజయం సాధించింది. మొత్తంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది.
చదవండి: వైశాలి సూసైడ్ కేస్: సంచలన విషయాలు వెల్లడించిన నటుడు
సమంత సర్జరీ చేసుకుందా?
Comments
Please login to add a commentAdd a comment